Atlanta, Georgia, August 16, 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గ్రంధాలయ పరిషత్ చైర్మన్, వికలాంగుల కార్పోరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తో జార్జియా రాష్ట్రం, అట్లాంటాలోని కమ్మింగ్ నగరంలో ఎన్నారై టీడీపీ (NRI TDP Atlanta) ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఆగష్టు 16 శనివారం రోజున స్థానిక సానీ మౌంటైన్ ఫార్మ్స్ (Sawnee Mountain Farms) ఎన్టీఆర్ విగ్రహ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముందుగా వెంకీ గద్దె (Venky Gadde) ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి గోనుగుంట్ల కోటేశ్వరరావు ని వేదిక మీదకు ఆహ్వానించగా, నరేన్ నల్లూరి (Naren Nalluri) పుష్ప గుచ్చంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మధుకర్ యార్లగడ్డ, కోటేశ్వరరావు కందిమళ్ల, ఫ్లోరిడా టాంపా నుంచి విచ్ఛేసిన వేణుగోపాల్ ప్రసంగించారు.
తదనంతరం గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ… తనకు అన్నగారితో ఉన్న అనుబంధం, ఎన్టీఆర్ సభల్లో పాల్గొన్న వైనం, నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రోత్సహించిన విధానం తదితర విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అలాగే గత ప్రభుత్వ విధ్వంస పాలనను ఎండగట్టారు.
మధ్య మధ్యలో జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అంటూ అందరినీ ఉత్సాహపరిచారు. రవి కిరణ్ మువ్వ (Ravi Kiran Muvva), కిరణ్ కొల్లా (Kiran Kolla) తదితరులు గోనుగుంట్ల కోటేశ్వరరావు ని శాలువాతో ఘనంగా సత్కరించారు.
వర్షం అంతరాయం కలిగించినప్పటికీ అందరూ ఉత్సాహంగా గోనుగుంట్ల కోటేశ్వరరావు (Gonuguntla Koteswara Rao) తో ఫోటోలు దిగారు. చివరిగా భోజనానంతరం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తో ఆత్మీయ సమావేశం ఘనంగా ముగిసింది.