Connect with us

News

New Jersey: ఆంధ్రప్రదేశ్ సైన్స్ & టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ రవి మందలపు తో ఆత్మీయ సమావేశం సెప్టెంబర్ 14న

Published

on

ప్రముఖ ప్రవాస భారతీయులు రవి కుమార్ మందలపు ఆంధ్రప్రదేశ్ సైన్స్ & టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ (Andhra Pradesh Science & Technology Academy) గా నియమితులైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా న్యూజెర్సీ (New Jersey), ఎడిసన్ లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నెల సెప్టెంబర్ 14, ఆదివారం ఉదయం 11 గంటలకు రవి మందలపు (Ravi Mandalapu) స్నేహితులు ఈ ఆత్మీయ సమావేశాన్ని (Meet & Greet) పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కావున న్యూజెర్సీ, న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లోని తెలుగువారందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected