తానా, ఆటా మరియు చికాగో సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన పంచసహస్రవధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా. మేడసాని మోహన్ (Dr. Medasani Mohan) గారు సాహిత్యంలో చమత్కారం మరియు హాస్యం పాత్రపై చాలా చక్కగా ఉపన్యాసించారు.
మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి చికాగోలోని సాహితీ ప్రియులు అందరూ విచ్చేయగ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా మేడసాని గారి చలోక్తులతో శ్రోతలను రంజింప చేసింది. ఈ సందర్భంగా మేడసాని గారు మాట్లాడుతూ మహాభారతంలోని అనేక సంఘటనలు ప్రస్తుత సమాజానికి ఎలా వర్తిస్తాయి, కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు తదితర పాత్రల ద్వారా అనేక అంశాలు మనకి భోదపడతాయన్నారు.
ఆధ్యాత్మికత అంటే మతం కాదు అదో గొప్ప నాగరికత అని, సంఘ జీవన హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం అని, భారత దేశ సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవని ఆయన అన్నారు. అనంతరం ఐటీ ఎంటర్ప్రెన్యుర్ శ్రీనివాస్ అరసాడ (Srinivas Arasada) గారు మేడసాని గారిని పట్టు వస్త్రాలు, తాంబూలంతో సన్మానించారు.
అలాగే వివిధ తెలుగు సంఘాల నుంచి నాట్స్, తానా, ఆటా, నాటా, చికాగో ఆంధ్ర అసోసియేషన్, బాలాజీ హిందూ టెంపుల్, సాయి టెంపుల్ ప్రతినిధులు మేడసాని గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయదేవ్ మెట్టుపల్లి, హేమ కానూరు గారు దగ్గరుండి పర్యవేక్షిస్తూ విజయవంతంగా ముగించారు.