Connect with us

News

మన్నవ మాస్ ర్యాలీ: గుంటూరులో 200 ట్రాక్టర్లతో నారా లోకేష్ కి మద్దతుగా వినూత్న ర్యాలీ

Published

on

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.

యువగళం పాదయాత్ర విజయవంతంగా 200 రోజులు పూర్తిచేసుకోనున్న సందర్భంగా యువనేత నారా లోకేష్ (Nara Lokesh) గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ గుంటూరు (Guntur, Andhra Pradesh) లో 200 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ.. ఒక్కడిగా మొదలై కోట్ల ముందుకి చేరువై సాగుతున్న యువగళం పాదయాత్ర ప్రజాఉప్పెనతో 200 రోజులు పూర్తి చేసుకొనుందని, కుప్పం నుంచి పడిన తొలి అడుగు నుంచి నేటివరకు.. నడిచిన కాలు ఆగకుండా, ఎత్తిన చేయి దింపకుండా, గర్జించిన గొంతు ఆపకుండా, అఖండమైన ప్రజాదరణ నడుమ లోకేష్ గారి పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోందని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని మోహన కృష్ణ స్పష్టం చేసారు.

ఈ మధ్య ఉమ్మడి గుంటూరు జిల్లాలో యువగళం (Yuvagalam) పాదయాత్ర ముగింపు రోజున కూడా మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వరకు వందలాది కార్లతో ర్యాలీగా వెళ్లి నారా లోకేష్ కి ఘనంగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected