Connect with us

News

NTR Foundation కి మన్నవ 2 కోట్ల భారీ విరాళం, చంద్రబాబు చేతుల మీదుగా అందజేత

Published

on

ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్ (NTR Foundation) కి నాట్స్ మాజీ అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) 2 కోట్ల రూపాయలను చెక్కును విరాళంగా (Donation) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కి ఉండవల్లి నివాసంలో అందచేశారు.

ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ… నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తోంది, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు (Blood Bank) ద్వారా వేలాదిమందికి రక్తదానం చేస్తోంది, ఎన్టీఆర్ సుజల పధకంతో త్రాగు నీరు లేని ఎన్నో గ్రామాలకు త్రాగు నీరు అందిస్తుంది.

ఉచిత మెడికల్ క్యాంప్ ల (Free Medical Camps) నిర్వహణ ఇలా పేదవారికీ అనేక సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ కి 2 కోట్ల రూపాయలను విరాళంగా అందించటం చాలా సంతోషంగా ఉందని మన్నవ మోహన కృష్ణ గారు అన్నారు. అమెరికాలో వున్న తెలుగు వారు కూడా అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్ (NTR Foundation) కి సహాయసహకారాలు అందిస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనం ఎంతో మంది పేదవారికి సహాయం చేసిన వాళ్ళం అవుతామని మన్నవ మోహన కృష్ణ అన్నారు.

ఈ కార్యక్రమంలో NRI TDP అధ్యక్షుడు రవి వేమూరి (Ravi Vemuri) మరియు ఎన్టీఆర్ ఫౌండేషన్ (USA) బోర్డు చైర్మన్ శ్రీధర్ గొట్టిపాటి (Sridhar Gottipati) పాల్గొన్నారు. అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్ కి మన్నవ మోహన కృష్ణ 2 కోట్ల రూపాయల చెక్కును అందచేసినందుకు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మన్నవ మోహన కృష్ణ ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected