Connect with us

Donation

రాజమహేంద్రవరం మహానాడుకి మన్నవ మోహనకృష్ణ 25 లక్షల విరాళం

Published

on

రాజమహేంద్రవరంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు (USA), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ 25 లక్షల రూపాయల చెక్కును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మన్నవ మోహనకృష్ణ ని అభినందిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా అటు అమెరికాలోను ఇటు ఆంధ్రప్రదేశ్ లోను తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించిన మన్నవ మోహనకృష్ణని చంద్రబాబు నాయుడు అభినందించారు.

ఈ 2023 మహానాడుకి 25 లక్షల రూపాయలు అందించటమే గాక గత సంవత్సరం 2022లో ఒంగోలులో జరిగిన మహానాడుకు కూడా మన్నవ మోహనకృష్ణ 31 లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిల్స్ ని అందజేసిన విషయాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించి మన్నవ మోహనకృష్ణని ప్రశంసించారు.

పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడడం అభినందనీయం అని, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేవారిని పార్టీ తప్పక గుర్తిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కుర్చునే వరకు అవిశ్రాంత సైనికుడిలా పని చేస్తానని అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected