గుంటూరు పశ్చిమ నియోజకవర్గం (Guntur West Constituency) లో పేద మహిళలకు వెయ్యి ప్రెజర్ కుక్కర్లు అందజేసిన మన్నవ మోహన కృష్ణ
పన్నులతో, అధిక ధరలతో, ఉపాధి లేమితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కట్లు పాలు.
నాలుగున్నరేళ్ల పాలనలో మధ్య తరగతి ప్రజల్ని పేదలుగా, పేదలను మరింత పేదరికంలోకి నెట్టిన జగన్ ప్రభుత్వం
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మన్నవ మోహనకృష్ణ ఛారిటిబుల్ ట్రస్ట్ ద్వారా వెయ్యి ప్రెజర్ కుక్కర్లు అందచేత
తమకు గొప్పగా మేలు చేసి ఉద్దరిస్తాడని ఆశపడి ఓట్లేసిన ప్రజలకు నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) నరకం చూపిస్తున్నాడని, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయిన చందంగా ఆయన పరిపాలన ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత మన్నవ మోహన కృష్ణ ఎద్దేవా చేశారు.
నాలుగున్నరేళ్ల వైసీపీ (YSR Congress Party) పాలనలో మధ్యతరగతి ప్రజలు పేదలుగా, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారని, ఫలితంగా పేద ప్రజలు ప్రాథమిక అవసరాలైన కూడు, గుడ్డ, గూడు వంటి వాటికి దూరమౌతున్నారని మన్నవ (Mannava Mohana Krishna) ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే తన మన్నవ మోహన కృష్ణ ఛారిటిబుల్ ట్రస్ట్ ద్వారా గత పదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామని మన్నవ మోహనకృష్ణ తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని సామాన్య, మధ్య తరగతి పేదలకు అవసరమైన గృహాపకరణాల్లో భాగంగా 1000 ప్రెజర్ కుక్కర్లు పంపిణీ చేసామన్నారు.
పేదల అభ్యున్నతే లక్ష్యంగా తమ మన్నవ మోహన కృష్ణ ఛారిటిబుల్ ట్రస్ట్ (Mannava Mohana Krishna Charitable Trust) అనేక సేవలు అందిస్తోందని, ఈ ఏడాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు వెయ్యి ప్రెజర్ కుక్కర్లు అందిస్తునట్లు మన్నవ మోహనకృష్ణ తెలిపారు.
పేదలపై, సామాన్య ప్రజలపై అధికంగా పన్నులు వేసి పీక్కు తినడమే కాకుండా నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, ఆస్తి పన్న, రోడ్డు పన్ను ఇలా అన్ని విధాలుగా పన్నులు భారీగా పెంచి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం (YCP Government) చెత్తపై పన్ను, మరుగుదొడ్డిపై పన్నులు అంటూ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ ఆర్థికంగా దెబ్బతిశారని అన్నారు. పట్టణాల్లోని మధ్య తరగతి జీవులపై అధికంగా పన్ను భారాలు వేయడంతో వారిలోని కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు.
ఇక పేదలు, రోజువారి కూలీల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందని, సంక్షేమం పేరుతో రూ. 10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారని మన్నవ మోహనకృష్ణ ధ్వజమెత్తారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, పేదలను సంపన్నులను చేయగలిగిన సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు.
మహిళా అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అని, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ (NTR), మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీని స్థాపించింది ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) అని మోహన కృష్ణ అన్నారు.
త్వరలో చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, చదుకుంటున్న ఇంట్లోని ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అని మోహన కృష్ణ అన్నారు.
మహిళలకు ఆర్ధికంగా, రాజకీయంగా, సాంఘికంగా మహిళా అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వోడగొట్టాలని మహిళలంతా ఎదురుచూస్తున్నారు అని మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) అన్నారు.