Guntur, Andhra Pradesh: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్లో లో మన్నవ మోహన కృష్ణ యూత్ (MMK Youth) సభ్యులు నిర్వహించిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారి పుట్టినరోజు వేడుకలో వేలాది మంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వేలాదిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మన్నవ మోహన కృష్ణ గారి అభిమానులు, ఆత్మీయులు భారీగా పాల్గొన్నారు. గుంటూరు (Guntur) నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు ర్యాలీలు నిర్వహించారు. సభా ప్రాంగణానికి విచ్చేసిన మన్నవ మోహన కృష్ణ గారికి గజమాలలతో స్వాగతం పలికారు.
భారీ క్రేన్ ల పై నుంచి అయన (Mannava Mohana Krishna) పై పూల వర్షం కురిపించారు. అభిమానుల కేరింతల మధ్య మన్నవ మోహన కృష్ణ భారీ కేక్ కట్ చేశారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్లో జరిగిన మన్నవ మోహన కృష్ణ జన్మదిన వేడుకలలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి (Galla Madhavi) గారు, చదలవాడ అరవింద్ బాబు గారు, భాష్యం ప్రవీణ్ గారు, మహ్మద్ నసీర్ గారు, వేగేశ్న నరేంద్ర వర్మ గారు, MLC ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (Alapati Rajendra Prasad) గారు, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, రాష్ట్ర గ్రంధాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఈ వేడుకలలో పాల్గొన్నారు.
రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మల్లె ఈశ్వరరావు గారు, గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ వడ్రాణం హరిబాబు గారు, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ సజీల గారు, పల్నాడు జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ (Kommalapati Sridhar) గారు కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నాయకులు మన్నెం శివనాగ మల్లేశ్వరరావు (మల్లి బాబు) గారు, కొల్లి బ్రహ్మయ్య గారు, వాసిరెడ్డి రవి గారు, నిమ్మల శేషయ్య గారు, తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు మరియు అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొని మన్నవ మోహన కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ సందర్బంగా మన్నవ మోహన కృష్ణ గారు మాట్లాడుతూ… తన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన తన ఆత్మీయులకు కృతజ్ఞతలు తెలియచేసారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసి, తనను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి, పార్టీలో, ప్రభుత్వంలో తనకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయడు (Nara Chandrababu Naidu) గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.
తనను అనునిత్యం ప్రోత్సహించే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారికి ధన్యవాదాలు తెలియచేసారు. ఇప్పుడు, ఎప్పుడూ చంద్రబాబు గారు, లోకేష్ (Nara Lokesh) గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, మరియు తెలుగు దేశం పార్టీ కి అంకితభావంతో నిరంతరం పని చేస్తానని మన్నవ మోహన కృష్ణ తెలియచేసారు.
ఉదయం మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) తన జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు లోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమములో అనాధ పిల్లలకు స్కూల్ యూనిఫామ్ లు మరియు పుస్తకాలు అందించారు. ఆ తరువాత ఆసుపత్రి లో పండ్లు పంచారు. తరువాత అనురాగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు అన్నదానం చేశారు.