Connect with us

Associations

అమెరికాలో మరో జాతీయ తెలుగు సంస్థ ఏర్పాటు – MATA (Mana American Telugu Association)

Published

on

ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి మరియు సమానత్వం అందిస్తూ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, యువతను ప్రోత్సహిస్తూ వయోదిక పౌరులకు ఉత్తమమైన సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకొని ఒక జాతీయ తెలుగు సంస్థ ఏర్పాటైంది.

అదే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Mana American Telugu Association – MATA). ‘మాటా’ (మన అమెరికన్ తెలుగు సంఘం) పేరిట ఒక కొత్త తెలుగు సంఘం, ఏప్రిల్ 14 శుక్రవారం న్యూజెర్సీలోని రాయల్ అల్బెర్ట్స్ పాలస్ లో జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో దాదాపు 2500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

తొలుత డా. వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘మాటా’ స్వాగత గీతానికి పార్థసారథి సంగీతం అందించగా ప్రముఖ నృత్యదర్శకులు స్వాతి అట్లూరి తన 70 మంది శిష్యబృందంతో ప్రదర్శించిన నృత్యం సభికుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ‘మాటా’ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల మాట్లాడుతూ సేవా, సంస్కృతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థ ను స్థాపించడం జరిగిందని సంస్థ విశిష్ట లక్ష్యాన్ని, దృక్పథాన్ని వివరించారు.

లక్ష్మీ మోపర్తి ఆధ్వర్యంలో యూత్ టీమ్ సంస్థ యొక్క మిషన్ మరియు విజన్‌ను ప్రదర్శించారు. న్యూజెర్సీ, న్యూయార్క్, గ్రేటర్ ఫిల్లీ, ఆల్బనీ, మేరీల్యాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, టాంపా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, అట్లాంటా, చికాగో, డెట్రాయిట్, కాన్సాస్ సిటీ, నార్త్ కరోలినా, వంటి దాదాపు 20 నగరాల్లో MATA తన చాప్టర్‌లను ప్రారంభించింది.

ఒహాయో, సెయింట్ లూయిస్, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా మరియు సీటెల్‌ నుండి 2000 మంది జీవిత సభ్యులుగా నమోదు అయ్యారు. న్యూయార్క్, న్యూజెర్సీ, గ్రేటర్ ఫిల్లీ, మేరీల్యాండ్, డి సి వర్జీనియా, అల్బానీ, డల్లాస్, ఫ్లోరిడా మరియు సీటెల్ నుండి ప్రతినిధులు స్వయంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.

తానా, ఆటా, నాటా, నాట్స్ తదితర సంస్థల నుండి ప్రతినిధులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘మాటా’ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభ కార్యక్రమం మినీ-కన్వెన్షన్ శైలిలో రుచికరమైన ఆహారంతో పాటు వివిధ విక్రేత స్టాల్స్‌తో నిర్వహించబడింది. స్థానిక పాఠశాలల నుండి దాదాపు 150 మంది యువకులు వివిధ నృత్య రూపాలను ప్రదర్శించారు.

గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను MATA కోర్ టీమ్ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గేదెల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, డాక్టర్ స్టానెలీ రెడ్డి, పవన్ దరిసి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ వెంపరాల, హరి ఎప్పనపల్లి, గంగాధర్ వుప్పాల, కిరణ్ దుద్దగి, విజయ్ భాస్కర్ కలాల్, ప్రవీణ్ గూడూరు, మహేందర్ నరాల, రామ్ మోహన్ చిన్నాల, వెంకట్ సుంకిరెడ్డి, శేఖర్ రెడ్డి కోనాల, శ్రీనివాస్ కనకం, లక్ష్మీ మోపర్తి, కృష్ణ సిద్ధాడ, గోపి వూట్కూరి, రఘు మోడుపోజు, వేణు గోపాల్ గిరి పాల్గొన్నారు.

అలాగే వెంకీ మస్తీ, అంజన్ కర్నాటి, గిరి కంభంమెట్టు, రఘురాం రెండుచింతల, గిరిజా మాదాసి, శ్రీధర్ గుడాల, బాబురావు సామల, రాజ్ ఆనందేసి, టోనీ జన్ను, సత్య నేమన, రవి కరీంగుల, రూపక్ కల్లూరి, దీపక్ కట్ట, శ్రీనివాస్ కోమట్‌పల్లి, సురేష్ ఖజానా, సుధాకర్ ఉప్పల, శిరీష గుండపనేని, జయ తెలుకుంట్ల, మల్లిక్ రెడ్డి, ఉజ్వల్ కస్తాల, మహేష్ చల్లూరి, పురుషోత్తం అనుమోలు, వెంకట్ చిలకమూరి, చైతు మద్దూరి, వెకటేష్ ముత్యాల మరియు కృష్ణశ్రీ గందం మరియు మల్లిక్ రావు బొల్లా తదితరులు కూడా పాల్గొన్నారు.

ప్రముఖ నేపథ్య గాయని సునీత తన సహ గాయకుడు అనిరుధ్ తో కలిసి మరపురాని సంగీత కచేరి తో అలరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి దాత కు అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected