ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి మరియు సమానత్వం అందిస్తూ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, యువతను ప్రోత్సహిస్తూ వయోదిక పౌరులకు ఉత్తమమైన సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకొని మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఏర్పాటైన వార్తని NRI2NRI.COM మీ ముందుకు తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
గత ఏప్రిల్ లో న్యూజెర్సీ (New Jersey) లోని రాయల్ ఆల్బర్ట్స్ పాలస్ (Royal Albert’s Palace) లో మన అమెరికా తెలుగు సంఘం (Mana American Telugu Association – MATA) దాదాపు 2500 మంది తెలుగు ప్రజలు మధ్య గ్రాండ్ గా లాంచ్ చేశారు.ప్రముఖ నేపథ్య గాయని సునీత తన సహ గాయకుడు అనిరుధ్ తో కలిసి మరపురాని సంగీత కచేరి తో అలరించారు.
ఇందులో భాగంగా జూన్ 16 శుక్రవారం రోజు సాయంత్రం అట్లాంటాలో ‘మాటా అట్లాంటా చాప్టర్’ కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మాటా’ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని (Srinivas Ganagoni) ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు.
అలాగే స్థానిక నేతలు మాటా (MATA) సంస్థ వివరాలను తెలియపరిచారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే స్వర రాగ సుధా బ్యాండ్ వారి సంగీత విభావరి వినసొంపుగా సాగింది. జాన్స్ క్రీక్ (Johns Creek) లోని బాంబే లాంజ్ (Bombay Lounge) లోనిర్వహించిన ఈ కార్యక్రమంలో విందు భోజనం సర్వ్ చేశారు.
పలువురు స్థానిక నేతలు ఈ మాటా అట్లాంటా (Atlanta) చాప్టర్ కిక్ ఆఫ్ ఈవెంట్లో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. చివరిగా వందన సమర్పణతో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) సంస్థ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.