ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) గారి స్ఫూర్తితో అట్లాంటా తాజ్ (Team Atlanta Janasena – TAJ) కు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికుడు యడవల్లి మహారాణ (MahaRana Yadavalli) గారు తమ కుటుంబ సభ్యుల రేవు సునీల్ కుమార్, యడవల్లి మౌళిమ, రేవు ఆర్క ద్వారా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న బొండాడ మహాలక్ష్మి గారికి చికిత్స నిమిత్తం ఐదు లక్షల ఆర్థిక సహాయం చేశారు.
ఈ ఆర్థిక సహాయం కార్యక్రమంలో కూకట్ పల్లి వీర మహిళా కోఆర్డినేటర్ నాయకురాలు అల్లం శెట్టి భాగ్యలక్ష్మి, కొల్లా శంకర్, అంజి, శేర్లింగంపల్లి వీర మహిళ నాయకురాలు ద్రాక్షాయిని, జూబ్లీహిల్స్ జనసేన (Jana Sena Party – JSP) నాయకుడు బండి కల్ల శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.