నిరంతర ప్రజా సేవకునిగా మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) అడుగులు వేస్తున్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడులా 22 ఏళ్ల పాటు అవిరళ కృషి చేస్తూ, అందరి ఆదరాభిమానాలు పొందుతూ, లాభాపేక్ష లేకుండా సేవే ప్రధానంగా ముందుకు అడుగులు వేస్తూ సాగుతున్నారు మధుకర్ యార్లగడ్డ.
23వ తానా (TANA) మహాసభల దాతల కమిటీ కోచైర్ గా, 2023 లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) బోర్డ్ సెక్రటరీగా, 2022 లో బోర్డ్ ట్రెజరర్ గా, 2021 లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా, అలాగే రావెన్స్ రిడ్జి హోం ఓనర్స్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా 6 సంవత్సరాలు ఇలా తనదైన శైలిలో విశిష్ట సేవలు అందించారు.
విశాల హృదయంతో సేవే మార్గంగా ఎన్నుకొని అయన ప్రయాణం ప్రారంభించారు. మళ్ళీ వెను తిరిగి చూడలేదు. అట్లాంటాలో తానా నిధుల సేకరణలో కీలకమైన సహాయ సహకారాలు అందించిన వారిలో మధుకర్ ఒకరు. రాబోయే 2023 లో జరగనున్న తానా మహాసభలకు కూడా ముఖ్య దాత కావటం గర్వ కారణంగా భావిస్తున్నారు మధుకర్.
అట్లాంటా (Atlanta)లో తానా ఫౌండేషన్ (TANA Foundation) 5k వాక్, తానా బ్యాక్ ప్యాక్ పంపిణీ, ధీమ్ తానా, కళాశాల, పాఠశాల, CPR, యోగా శిక్షణ, బోన్ మ్యారో డ్రైవ్, తానా కేర్స్, బిజినెస్ సెమినార్లు, తానా – క్యూరీ లెర్నింగ్ మాథ్ బౌల్ అండ్ సైన్స్ బౌల్ పోటీల నిర్వహణలో అయన ప్రధాన పాత్ర పోషించారు.
గత 4 సంవత్సరాలుగా అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఉచిత క్లినిక్ (TAMA Free Clinic) కోసం నిధుల సేకరణలో, అలాగే 2016 లో జరిగిన తామా 35 సంవత్సరాల మరియు 2021 లో తామా (Telugu Association of Metro Atlanta) 40 ఏళ్ల మైలురాయి వేడుకలలో మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) చురుకైన పాత్ర పోషించారు.
అట్లాంటా ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) మరియు ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) కార్యకలాపాలలో ముఖ్య భూమిక వహిస్తున్నారు.2010 నుంచి 2014 వరకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ (Telugu Association of Greater Kansas City) సాంసృతిక కార్యక్రమాల నిర్వహణ మరియు 5కే వాక్ నిర్వహణలో తోడ్పడ్డారు.
2001 నుంచి 2010 వరకు అర్బానా షాంపైన్ (Urbana-Champaign) కమ్యూనిటీ ఈవెంట్లలో కీ రోల్ ప్లే చేశారు. సుమారు 8 సంవత్సరాలపాటు తాను చదువుకున్న కాలేజీ ఆలంనై అసోసియేషన్ లో ప్రముఖ పాత్ర పోషించారు.మధుకర్ యార్లగడ్డ ఇటు అమెరికాలోనే కాకుండా అటు భారతదేశంలో కూడా తన వంతు సేవ చేస్తూనే ఉన్నారు.
కృష్ణా జిల్లా (Krishna District) మువ్వ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓవర్ హెడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేశారు. అలాగే మువ్వ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పాఠ్య పుస్తకాలు తో పాటు స్పోర్ట్స్ కిట్ లను పంపిణీ చేశారు. 2020 లో అమరావతి పరిరక్షణ సమితి (Amaravati Parirakshana Samithi) కి 2 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
ఇలా మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) రెండు దశాబ్దాల ప్రస్థానంలో తనదైన సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నారు. ఇ లాంటి నేపథ్యం కలిగిన లీడర్ అవసరం తానాకు ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ తానా సౌత్-ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్ గా మధుకర్ యార్లగడ్డ కి, అలాగే టీం కొడాలి (Team Kodali) కి వోట్ వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.