లాస్ ఏంజలెస్ పరిసర ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలు నిర్వహించిన సామూహిక శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. ఏప్రిల్ 10 ఆదివారం రోజున సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉత్సవం భద్రాచల రాములవారి కల్యాణాన్ని తలపించింది.
గత 6 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ సంవత్సరం సుమారు 70 జంటలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని రాం కొడితాల, చందు నంగినేని, కుమార్ తాలింకి మరియు మనోహర్ ఎడ్మా ముందుండి నడిపించారు.
తెలుగు సంఘాలతో సంబంధం లేకుండా, పలు తెలుగు కుటుంబాలు కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రవాసులు విరివిగా పాల్గొన్నారు. విందు భోజన ఫలహారాలతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ముగిసింది.