Connect with us

Devotional

అట్లాంటాలో ఆయ్యప్ప స్వామి పెటైతుళ్లి ఆట

Published

on

అట్లాంటా అయ్యప్ప స్వామి గుడిలో ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు మాల వేసుకొని భారతదేశంలో మాదిరిగా నిష్ఠగా ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక కమ్మింగ్ నగరంలో ఈ సంవత్సరం అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి ఇష్టమైన పెటైతుళ్లి ఆట ఆడి ఆలపించడం మీ కోసం.

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల (4 సార్లు)
ఊగు ఊగు ఉయ్యాల, ఊపవయ్యా ఉయ్యాల (4 సార్లు)
స్వామి, మా గణపతయ్య ఊపంగా ఊగు ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల (2 సార్లు)
గణపతయ్య ఊపంగా ఊగు ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల (2 సార్లు)
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల (4 సార్లు)
స్వామి, మా మురుగన్ ఊపంగా ఊగు ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల (2 సార్లు)
మురుగన్ ఊపంగా ఊగు ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల (4 సార్లు)
ఊగు ఊగు ఉయ్యాల, ఊపవయ్యా ఉయ్యాల (4 సార్లు)
స్వామి, మేమంతా పాడంగా ఊగు ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల (4 సార్లు)

జాతరో జాతర అయ్యప్ప జాతర (4 సార్లు)
అయ్యప్ప జాతర, పెటైతుళ్లి ఆటరా (4 సార్లు)
అయ్యానేను పోతనే, అయ్యప్ప దగ్గరకు (4 సార్లు)
శంకరుడి సుతుడేనని శబరికొండ అయ్యప్ప (4 సార్లు)
దేముడ్ని చూసొస్తా, దండాలు పెట్టెస్తా (4 సార్లు)
జాతరో జాతర అయ్యప్ప జాతర (4 సార్లు)

కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు (4 సార్లు)
ఏడదాగి ఉన్నావయ్యో అయ్యప్ప (4 సార్లు)
ఒక్కసారి కానరావో అయ్యప్ప (2 సార్లు)
కొండాకొండాకి నడుమ మలయాళదేశమంట (4 సార్లు)
ఏకొండలో ఉన్నావయ్యో అయ్యప్ప (2 సార్లు)
ఏకొండలో వెతకాలయ్యో అయ్యప్ప (2 సార్లు)
కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు (2 సార్లు)
గంటస్వాములొచ్చారు గధాస్వాములొచ్చారు (2 సార్లు)
ఏడదాగి ఉన్నావయ్యో అయ్యప్ప (2 సార్లు)
ఒక్కసారి కానరావో అయ్యప్ప (2 సార్లు)

స్వామియే శరణం అయ్యప్ప!

మరిన్ని ఫోటోల కొరకు Shanvi Clicks మీద క్లిక్ చెయ్యండి.

error: NRI2NRI.COM copyright content is protected