Connect with us

Events

యూకే ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో లండన్ లో ఎన్టీఆర్ శత జయంతోత్సవాలు

Published

on

తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవం సందర్బంగా లండన్ మహానగరం లో ఈస్ట్ లండన్ నగరం నందు గల తెలుగువారు ఖండాలు దాటినా తమ అభిమాన నాయకుడిని మర్చిపోము అనిచెప్పి జయంతోత్సవాలు నిర్వహించారు.

ఆ మహానాయకుడి శత జయంతి సందర్బంగా పసుపు పండుగ మహానాడు 2022 వేదిక చుట్టూ పచ్చని జెండాలతో అన్న ఎన్టీఆర్ చిత్రాలతో తెలుగు దేశం కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో మొదటగా తమ అభిమాన నటుడు మహానాయకుడు అయిన అన్న నందమూరి తారక రాముడి విగ్రహానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమంను ప్రారంభించారు. మా తెలుగు తల్లి సాంగ్ ద్వారా ఉత్తేజితులను చేసి పార్టీ లో ఉంటూ పార్టీ కి సేవ చేస్తూ మరణించిన నేతలను స్మరించుకుని సంతాపం తెలియచేసారు.

మహానాడు 2022 కార్యక్రమంలో వక్తలు ముందుగా మహానాయకుడిని స్మరించుకుంటూ అయన పార్టీ ని స్థాపించిన నాటి విషయాలు స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను పేదలకోసం ప్రవేశపెట్టిన 2 రూపాయల కు కిలో బియ్యం, జనతా వస్త్రాల గురించి మహిళల కోసం దేశంలోనే మొదటి సారి ఆస్తి హక్కును తీసుకొచ్చి ప్రతి మహిళకు అన్నగా అయ్యారు అని స్మరించుకున్నారు.

అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు ఎలా అండగా నిలిచారు అనేది చర్చించుకున్నారు. వేదిక మీద స్వాతి రెడ్డి కనపడగానే అందరు తుగ్లక్ బ్రో డైలాగ్ చెప్పమని అడిగారు. ఏపీ లో ఎం ఫేమస్ అని స్వాతి అనగానే అక్కడ ఉన్న పిల్లలు పెద్దలు మీ తుగ్లక్ బ్రో ఫేమస్ అని గట్టిగా అరవడం తో సభ లో జోష్ నెలకొంది. అనంతరం స్వాతి రెడ్డి ప్రవాసాంధ్రులని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా ని ఎలా ఉపయోగించుకుని పార్టీ ని బలపరచాలో సందేశం ఇస్తూ యువతని ప్రోత్సహిస్తూ ఉత్తేజ పరిచారు.

వైసీపీ దుష్ట పరిపాలన ని అడ్డుకోవడానికి ప్రవాస ఆంధ్రులు తెలుగు దేశం పార్టీ కి ఇంతకు ముందుకంటే 100 సార్లు ఎక్కువగా పార్టీని బలోపేతం చేయడం కోసం ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. 2024 లో జరగబోయే ఎలెక్షన్స్ లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటం ఆపొద్దు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్న గారి శత జయంతి ఉత్సవాలను రాబోయే 365 రోజులు ఎలా జరుపుకోవాలని, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా ఎలా ఎండగట్టాలి అనేది, అలాగే ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి రావటం కోసం ఎలా పని చెయ్యాలి అనే విషయాల మీద చర్చించుకున్నారు.

చివరి గా అన్న గారి జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన కేక్ ని అన్నగారిని స్మరించు కుంటూ వేదిక మొత్తం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో వేదిక దద్దరిల్లి పోయేలా చేశారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి శ్రీదేవి గారు పాల్గొని జెండా వందనం చేశారు. సుధీర్ కొత్తపల్లి, నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్యామ్ సుందరరావు ఊట్ల, సజ్జ శ్యామ్, రామకృష్ణ నాయుడు, అనిల్ పచ్చ, జగదీశ్ బండారుపల్లి, మురళికృష్ణా ఆరి, శ్రీనివాస్ వళ్లిపల్లి, సాయి కృష్ణ గుర్రం, విజయ్ కుమార్ తదితరులు పూర్తి సహాయ సహకారాలు కార్యక్రమంకు అందించారు.

అదే విధంగా ఈ కార్యక్రమంకి ఆంధ్రప్రదేశ్ నుండి మాజీ మంత్రి వర్యలు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, నక్కా ఆనంద బాబు గారు, పరిటాల సునీత గారు, కాలువ శ్రీనివాసులు గారు, పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఉరవకొండ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష గారు, మన్నవ సుబ్బారావు గారు, మరియు కిమిడి నాగార్జున గారు జూమ్ కాల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ తో వారికి వున్న పరిచయాలను జ్ఞాపకాలను పంచుకున్నారు. నిర్వాహకులను కార్యక్రమం బాగా చేసారు అని కితాబిచ్చారు. అలాగే మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి అలాగే 2024 పార్టీ విజయం కోసం పనిచెయ్యాలి అని చెప్పారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected