తను చూడడానికి చాలా కామ్ గా ఉంటారు. కానీ తన అనుకున్నవాళ్ళకి ఇబ్బంది వచ్చినా లేదా ఎవరైనా అవసరంలో ఉన్నారని తెలిసినా అదే రీతిలో దూకుడుగా వ్యవహరిస్తారు. అది అమెరికా అయినా సరే లేక ఆంధ్ర అయినా సరే, ముందుండి నిలబడి సహాయం చేస్తారు. తనే చిత్తూరు జిల్లా, మదనపల్లి చిన్నోడులోకేష్ నాయుడు కొణిదల.
ఉద్యోగ రీత్యా అమెరికా (Dallas, Texas) విచ్చేసిన లోకేష్ నాయుడు కొణిదల (Lokesh Naidu Konidala), ఐటీ వ్యారంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇటు అమెరికా అటు ఇండియాలో కలిపి దాదాపు 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
ఆర్ధికంగా తన పరిస్థితి బాగుండడంతో తన చుట్టూ సమాజంలో ఉన్న నలుగురికి సేవ చేద్దామనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా సేవాకార్యక్రమాలు (Service Activities) ప్రారంభించారు. ఈ విషయం తోటి డల్లాస్ (Dallas Fort Worth) వాసులకు బాగా తెలుసు.
తర్వాత స్థానిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) లో కార్యనిర్వాహక సభ్యునిగా మరియు సంయుక్తకోశాధికారి (Joint Treasurer) గా సేవలందించి మంచి పేరు గడించారు. అనంతరం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ‘తానా’ లో పదవులకు అతీతంగా సేవలందించారు.
తానా (Telugu Association of North America) స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కమిటీకి నేషనల్ అడ్‌హాక్ చైర్ పర్సన్ గా, పబ్లిక్ రిలేషన్స్ కమిటీకి నేషనల్ అడ్‌హాక్ చైర్ పర్సన్ గా, అలాగే తానా కార్యవర్గంలో క్రీడా కార్యదర్శి గా మరియు కౌన్సిలర్ ఎట్ లార్జ్ గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.
మొత్తంగా 200 కి పైగా సేవా కార్యక్రమాలలో ముఖ్య పాత్ర పోషించారు. టీమ్ స్క్వేర్ (TEAM Square) మరియు తానా కేర్స్ (TANA Cares) లో వలంటీర్ గా సేవలందించారు. చిన్నారులకు ఆన్లైన్ చెస్ క్లాసులు, సమ్మర్ క్యాంప్స్, చెస్ పోటీలు, గోల్ఫ్ & క్రికెట్ టోర్నమెంట్‌లు నిర్వహించి వారి మనోవికాసానికి తోడ్పడ్డారు.
అలాగే ఇండియా (India) లో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. 100కు పైగా విద్యార్థులకు స్కాలర్‌షిప్ ల పంపిణీ, క్యాన్సర్ క్యాంపుల నిర్వహణ, 40కిపైగా సైకిళ్ళ పంపిణీ, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, మహిళలకు 40కిపైగా కుట్టుమిషన్ల పంపిణీ, పేద విద్యార్థులకు లాప్తొప్స్ డొనేషన్ లోకేష్ చేసిన కార్యక్రమాలలో కొన్నిమచ్చు తునకలు.
కోవిడ్ (COVID) మహమ్మారి సమయంలో మాస్క్‌లు, ఆక్సిజన్ సిలండర్లు, శానిటైజర్లు అందించి దైర్యం నింపారు. తానా తో పాటుగా ATA, NATA, TATA, NATS, TPAD, DATA, DARA లాంటి అనేక తెలుగు సంస్థలకు (Telugu Associations) తన వంతుగా సహాయ సహకారాలను అందించారు.
అవసరం వచ్చినప్పుడల్లా తానా (TANA) కార్యక్రమాల కోసం నిధుల సేకరణ చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. ఎపి జన్మభూమి (AP Janmabhoomi) కోఆర్డినేటర్ గా మాతృభూమిలోని పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు సహకరించారు.
అలాగే డిఎఫ్ డబ్ల్యు (Dallas Fort Worth) ప్రాంతంలో వివిధ చారిటీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు.తానాలో వివిధ పదవుల ద్వారా విశేషంగా సేవలందించిన లోకేష్ నాయుడు కొణిదల ప్రస్తుత ఎన్నికల్లో కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేస్తున్నారు.
దశబ్ధానికి పైగా తానా (Telugu Association of North America) ద్వారా అందించిన సేవలను గుర్తుంచుకుని, అందరినీ కలుపుకొనిపోతూ కార్యక్రమాలు చేసి విజయం సాధించిన తనను మరోమారు గెలిపించి తెలుగువారికి సేవలందించే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
తానా (TANA) ద్వారా తెలుగువారికి సేవ చేయడంతోపాటు కమ్యూనిటీకి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేయడం, అమెరికాకు వచ్చిన తల్లితండ్రులు, స్టూడెంట్లకు ఆరోగ్య భీమా చేయడం ఎంత ముఖ్యమో తెలియజేసే లాంటి అవగాహనా కార్యక్రమాలు, విల్ అండ్ ట్రస్ట్ ప్లానింగ్ సెషన్స్, బ్యాక్ ప్యాక్ కార్యక్రమం, బోన్ మారో డ్రైవ్‌లు, సిపిఆర్ ట్రైనింగ్, కిడ్స్ కార్యక్రమాలు, ఫుడ్ డ్రైవ్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం తన లక్ష్యాలంటున్నారు.
కాబట్టి 2023-25 కాలానికి తానా ఎలక్షన్స్ లో కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (Community Service Coordinator) అభ్యర్థిగా బరిలోకి దిగిన అందరివాడు, తానా సభ్యులకు దగ్గరివాడు అయినలోకేష్ కు, అలాగే టీం కొడాలి ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలుపు తీరాలకు చేర్చవలసిందిగా కోరుతున్నారు లోకేష్ నాయుడు కొణిదల (Lokesh Naidu Konidala).