Connect with us

News

లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Published

on

తెలంగాణ‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికల ప్రకారం లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్ 20 ఆదివారం నుంచి లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది. తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని కేబినెట్ నిర్ధారించింది. కాగా, అన్ని విద్యా సంస్థలను జూలై 1 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖను ఆదేశించింది.

ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను తప్పక పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది.

error: NRI2NRI.COM copyright content is protected