Connect with us

Literary

బాల్యం గుర్తుకు వస్తుంది, బంధాలు బాధిస్తాయి.. మల్లికా రెడ్డి

Published

on

బాల్యం గుర్తుకు వస్తుంది!

మనసారా విలపించ లేనప్పుడు
ప్రశాంతంగా నిద్రించ లేనప్పుడు
ప్రాపంచిక మైకంలో ఇమడ లేనప్పుడు
బాల్యం గుర్తుకు వస్తుంది

ఎప్పుడైతే మనసు విరిగిపోతుందో
ఎప్పుడైతే మన అనుకున్న వాళ్ళు దూరం అవుతారో
ఎప్పుడైతే స్వప్నాలు వెంటాడతాయో
బాల్యం గుర్తుకు వస్తుంది

ఎవరినైనా సహించలేనప్పుడు
ఒంటరితనాన్ని భరించలేనప్పుడు
ఎవరితో చెప్పుకోలేనప్పుడు
బాల్యం గుర్తుకు వస్తుంది.

బంధాలు X వాతావరణం

బంధాలు, వాతావరణం ఒకేలా ఉంటాయి
అప్పుడప్పుడు హద్దులు మీరి ఆకర్షిస్తాయి
ఎప్పుడోకప్పుడు భరించ లేనంతగా మీరుతాయి
వాతావరణం వదనాన్ని బాధిస్తే
బంధాలు మాత్రం ఆత్మను బాధిస్తాయి

మల్లికా రెడ్డి
(సంభవామి యుగే యుగే
)

error: NRI2NRI.COM copyright content is protected