కెనడా లోని ప్రముఖ తెలుగు ఎన్నారై లక్ష్మీనారాయణ సూరపనేని కి అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా (Telugu Alliances of Canada – TACA) అనే సంస్థ గొప్ప పురస్కారాన్ని అందజేసింది. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 13 శనివారం రోజున ఈ పురస్కారాన్ని అందజేశారు.
దాదాపు 1500 మంది ప్రవాస తెలుగువారి సమక్షంలో కెనడా (Canada) దేశం లోని టోరంటో పెవిలియన్ హాల్లో 67 సంవత్సరాల వయసులో లక్ష్మీనారాయణ సూరపనేని కి ఈ గౌరవం (Award) దక్కింది. గత 34 సంవత్సరాలుగా కెనడా లో చేస్తున్న సమాజసేవకు (Community Service) గుర్తింపుగా 2024 సంవత్సరానికి గానూ TACA గావర్ణింగ్ బోర్డు లక్ష్మీనారాయణ కు ఈ అవార్డు అందజేశారు.
లక్ష్మీనారాయణ సూరపనేని, భార్య ఇద్దరు పిల్లలతో కెనడా లోని టోరంటో (Toronto) నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిచెనర్ (Kitchener) పట్టణంలో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం, కృష్ణా జిల్లా, దివి తాలూకా, పెదశనగల్లు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ 14 సంవత్సరాలపాటు ఇండియాలో చేసిన ఉద్యోగం వదిలేసి 1990 లో కెనడాకి వచ్చారు.
కిచెనర్ (Kitchener, Ontario)లోని కొనెస్టోగా కాలేజీలో (Conestoga College) డిగ్రీ పూర్తి చేశారు.అలాగే 2003 లో ఎంబీఏ చదివారు. స్థానిక ఇంజనీరింగ్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అంతకు ముందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ లో కెనడాకి ప్రాతినిధ్యం వహిస్తూ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లతో లక్ష్మీనారాయణ (Lakshminarayana Surapaneni) కి మంచి సంబంధాలున్నాయి.2007 లోనే నారా చంద్రబాబు నాయుడుని కెనడాకి ఆహ్వానించి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత, సామర్ధ్యం లక్ష్మీనారాయణ సొంతం.
గత 34 సంవత్సరాలుగా కెనడా (Canada) లోని తెలుగువారికి తలలో నాలుకలా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ సూరపనేని కి TACA (Telugu Alliances of Canada) ఉగాది పురస్కారం దక్కడం అభినందనీయం అంటూ తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.