Connect with us

Telugu Desam Party

మిన్నంటిన కూటమి విజయోత్సవ సంబరాలు @ Minneapolis, Minnesota

Published

on

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసమాన విజయాన్ని కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రెండవసారి విభజితాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మిన్నెసోటా (Minnesota) రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలిస్ (Minneapolis), సెయింట్ పాల్‌ (Saint Paul) లోని ఎన్నారై టీడిపి (TDP), ఎన్నారై జనసేన (JSP), ఎన్నారై బిజెపి (BJP) నాయకులు ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 కి పైగా కూటమి అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Assembly Elections) ఎన్నడూ లేనంత మంది ఎన్నారైలు (NRIs) తమ మూలాలు మర్చిపోకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీచేసి విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli Radha Krishna), పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా (Varla Kumar Raja) ఆన్లైన్ ద్వారా తమ సందేశాలను, తాము చేయబోతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు ఎన్నారైలు ఈ విజయం కోసం పడిన కష్టాలను, చేసిన సహాయాన్ని మరువలేమన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్నారై టిడిపి మిన్నియాపోలిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామ్ వంకిన, రావ్ గుత్తా, వెంకట్ జువ్వా, వేదవ్యాస్ అరవపల్లి, అజయ్ తాళ్లూరి, వివేక్ వల్లూరి మరియు మిత్రులు శ్రీమాన్ యార్లగడ్డ, నాగ్ నల్లబోలు, నాయుడు సాలాది, కాశీ బురిడి, ఆర్కే, వెంకన్న చౌదరి, సుమన్ లావు, హరీష్ చింతాడ, పరమేశ్వర్, నాగ్ బొల్లు, సత్యనారాయణ, అనిల్ స్వయంపు, మురళి ముత్యాల, బాల అక్కిన, అశోక్ సుంకవల్లి, కోటేశ్వర పాలడుగు మరియు జనసేన నాయకులు సంతోష్, రఘు గొలకోటి, రామ్ కూటల తదితరులు నిర్వహించారు.

కార్యక్రమం అనంతరం వచ్చినవారందరికీ పసందైన విందు భోజనాన్ని అందించారు. మిన్నియాపోలిస్ (Minneapolis) మరియు సెయింట్ పాల్ (Saint Paul) లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడిపి నాయకులు, జనసేన నాయకులు, బిజెపి నాయకులు, ఈప్రాంతంలో చదువుతున్న పలువురు విద్యార్థులు మరియు మహిళలు, పిల్లలు, పెద్దవారు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected