ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ద్వారానే కాకుండా ఇతర సంస్థలు మరియు వ్యక్తిగతంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకే చెల్లింది. ఇప్పటి వరకు ఒక లెక్క అయితే గత 5 నెలలుగా తానా లో స్థబ్దత నెలకొన్న కారణాల రీత్యా ఏదో అడపా దడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కానీ ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా అమెరికా మొత్తంలో తానా (TANA) కార్యక్రమాలు ఆగినప్పటికీ ఒక్క న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో మాత్రం తానా సేవా కార్యక్రమాలు ఆగిన దాఖలాలు లేవు. ఇంకా నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే తానా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనే కృష్ణ ప్రసాద్ సోంపల్లి.
ఇంకో స్టెప్ పైకి వెళ్లి, గత 5 నెలలుగా అమెరికాలోనే కాకుండా ఇండియా (India) లో సైతం తానా కార్యక్రమాలు నిర్వహించడం కృష్ణ ప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) కే చెల్లింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని 100 పాఠశాలల్లో CPR మరియు AED శిక్షణకి ప్రణాళిక వేశారు.
భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, భారత రత్న గ్రహీత డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలో కృష్ణ ప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) ఆధ్వర్యంలో అత్యవస సమయాల్లో చేయాల్సిన CPR మరియు AED శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
ఇక్కడ అమెరికాలో కూడా న్యూ ఇంగ్లండ్ (New England) ప్రాంతంలో వినాయక చవితి సంబరాలు, 5కె వాక్, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, అతిపెద్ద బాడ్మింటన్ ఆటల పోటీలు, పాఠశాల పరీక్షలు వంటి కార్యక్రమాలతో న్యూ ఇంగ్లాండ్ లో తానా కి మంచి ఊపు తెచ్చారు.
కృష్ణ ప్రసాద్ సోంపల్లి సేవా కార్యక్రమాలు
. అవసరమైన వారి కోసం సున్నితంగా ఉపయోగించిన దుస్తుల డ్రైవ్‌ను సమన్వయం చేశారు. . గుంటూరు జిల్లాలోని కళాశాలలు / పాఠశాలల్లో మరియు చుట్టుపక్కల 15 ప్లస్ CPR క్యాంపులను నిర్వహించారు. . బోస్టన్‌లో 5K వాక్ నిర్వహించారు. . తానా న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సమన్వయం చేశారు. . ఆరోగ్యకరమైన కమ్యూనిటీని పెంపొందించడానికి కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన గణేష్ ఉత్సవాన్ని సమన్వయం చేశారు. . పద్మావతి విశ్వవిద్యాలయం నియమించిన స్థానిక విద్యార్థులు మరియు సిబ్బందితో తానా పాఠశాల పరీక్షలు సమన్వయం చేశారు. . 245 మ్యాచ్‌లతో న్యూ ఇంగ్లాండ్‌లోని 4 రాష్ట్రాల నుండి 170 మంది ఆటగాళ్ల భాగస్వామ్యంతో తానా యొక్క అతిపెద్ద బ్యాడ్మింటన్ లీగ్‌ను నిర్వహించారు.
కృష్ణ ప్రసాద్ సోంపల్లి అందుకున్న పురస్కారాలు
. దాతృత్వ కార్యక్రమాలకు సంబంధించి 2 సార్లు US ప్రెసిడెన్షియల్ అవార్డు. . బోస్టన్ మేయర్ అవార్డు. . 2022 బోస్టన్ అసాధారణ వాలంటీర్ అవార్డు.
ప్రస్తుత తానా ఎన్నికలలో న్యూ ఇంగ్లండ్ ప్రాంత ప్రతినిధిగా (TANA Regional Representative – New England) పోటీ చేస్తున్నారు. తన సేవాతత్పరతను చూసి తనకు మరియు తన టీం కొడాలి ప్యానెల్ లోని అందరికీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా తానా సభ్యులను వినమ్రంగా కోరుతున్నారు.