Connect with us

Devotional

పెనమలూరులో అయ్యప్ప స్వామి ధార్మిక కార్యక్రమం: ప్రవాసుల విరాళం

Published

on

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెనమలూరు గ్రామంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా జనవరి 30న జరగనున్న అయ్యప్పస్వామి అన్నసమారాధన కార్యక్రమానికి పెనమలూరు ప్రవాసులు సహాయం అందించారు. అన్నదానానికి లక్ష రూపాయలు సేకరించి స్వగ్రామానికి పంపారు.

ఈ మొత్తాన్ని ప్రవాసుల స్థానిక ప్రతినిధులు కార్యక్రమ నిర్వాహకులకు అందచేశారు. పుట్టి పెరిగిన గ్రామంలో నిర్వహించనున్న ధార్మిక కార్యక్రమానికి పెనమలూరు ప్రవాసులు ఎప్పటిలానే చేయూతను అందించడాన్ని గ్రామ పెద్దలు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రవాసుల స్థానిక ప్రతినిధులు కిలారు ప్రవీణ్, పాలడుగు సుధీర్, అయ్యప్పస్వామి అన్నసమారాధన కమిటీ సభ్యులు ముప్పాళ్ల పూర్ణ చంద్రరావు (చిన్ని), కోయ రామకృష్ణ, కోయ మధుసూదన రావు, జాస్తి పూర్ణరావు, పరుచూరి రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected