Connect with us

Devotional

ధార్మికతను పెంపొందిస్తున్న పెనమలూరు ఎన్నారైలు, అయ్యప్ప స్వామి అన్న సమారాధనకు విరాళం

Published

on

పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ (Penamaluru NRI Association) ద్వారా ఎన్నారైలు ఎప్పటికప్పుడు తమ దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటున్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం, మరోపక్క గ్రామస్తుల వినియోగం కోసం, అలాగే ధార్మికతను పెంపొందించేలా, భక్తి మార్గాన్ని అనుసరించేలా చేయడం వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

120 మంది ప్రవాసులతో కూడిన పెనమలూరు ఎన్నారై అసోసియేషనే వీటన్నిటికీ కర్త కర్మ క్రియ. 2017 నుంచి ఏ అవసరం వచ్చినా, అది చిన్నదా పెద్దదా అని చూడకుండా పెనమలూరు ఎన్నారైలందరినీ వెంటనే సమన్వయపరిచి, ఒకే తాటిమీదకి తీసుకువచ్చి సహాయం చేసేలా ముందడుగు వేపిస్తున్న ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni) అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అందుకేనేమో కృష్ణా జిల్లా విజయవాడ (Vijayawada) ని అనుకోని ఉన్న ఈ పెనమలూరు గ్రామంలో ఎక్కువ మంది అభివృద్ధిపథంలో నడుస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 29న జరగనున్న అయ్యప్ప స్వామి 43వ అన్నసమారాధన కార్యక్రమంలో 50 వేల మందికి భోజన ప్రసాదాలకు అవసరమైన 120 బస్తాల బియ్యానికి సరిపడేలా సుమారు లక్ష అరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరంలానే పెనమలూరు ప్రవాసులు విరాళంగా అందజేశారు.

ఈ మొత్తాన్ని ఎన్నారై స్థానిక ప్రతినిధులు జనవరి 12న నిర్వాహకులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో కిలారు ప్రవీణ్, పాలడుగు సుధీర్, అయ్యప్ప స్వామి (Ayyappa Swami) అన్న సమారాధన కమిటీ సభ్యులు ముప్పాళ్ల పూర్ణ చంద్రరావు (చిన్ని), జాస్తి పూర్ణరావు, కిలారు బలరామయ్య, పరుచూరి రఘు తదితరులు పాల్గొన్నారు. తాము పుట్టి పెరిగిన గ్రామంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా తోడ్పడుతున్న పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected