తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పలు నగరాల్లో ఎన్నారై టీడీపీ సభ్యులతో సమావేశమవుతున్నారు. అలాంటి సమావేశం ఒకటి ఏప్రిల్ 17 ఆదివారం అట్లాంటా నగరంలో ఎన్నారై టీడీపీ అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముందుగా మల్లిక్ మేదరమెట్ల నవ్యాంధ్ర పునఃనిర్మాణాన్ని కోరుకుంటూ విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం పలికి, సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను సభకు పరిచయం చేసారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు మురళి బొడ్డు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్పర్సన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు టీడీపీ ని స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ గమనం, ఎన్టీఆర్ మరియు నారా చంద్రబాబు నాయుడు ల పరిపాలనా దక్షత, ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, ప్రస్తుత వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, గత 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడడం, తనను అణగదొక్కడానికి చేసిన కుట్రలు తదితర విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
నిరంకుశపాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన జగన్మోహన్ రెడ్డి ని ఏమనాలో తెలియట్లేదు అని పట్టాభిరామ్ అన్నప్పుడు, సభికులు ‘బోషడీకే’ అంటూ అరవడంతో సభలో ఆనందాలు వెల్లివిరిశాయి. అలాగే 2024 లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత బుల్డోజర్ లా వైసీపీ ని తొక్కిపడేస్తాం అంటూ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా డైలాగ్స్ తో ఆహుతులలో విశ్వాసాన్ని నింపారు.
అనంతరం సభికులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ లావు, రాము వెనిగండ్ల పట్టాభిరామ్ ని సన్మానించారు. అలాగే స్నేహ, హేమ పట్టాభిరామ్ సతీమణిని సత్కరించారు. ప్రతి ఒక్కరూ లైన్లో వేచిఉండి మరీ పట్టాభిరామ్ తో ఫోటోలు దిగడం చుస్తే తనకున్న ఫాలోయింగ్ ఏంటో అర్ధమయ్యింది.
చివరిగా వారాంతం, అందునా ఆదివారం రాత్రి అయినప్పటికీ తమ ఆహ్వానాన్ని మన్నించి రావడమే కాకుండా 11 గంటల వరకు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 150 మందికి పైగా సభికులకు, అలాగే వేదికను అందించి మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేసిన పెర్సిస్ బిర్యానీ అండ్ గ్రిల్ రెస్టారెంట్ శ్రీధర్ దొడ్డపనేని, ఈ కార్యక్రమ ఏర్పాట్లు సమన్వయపరిచిన శరత్ అనంతు, వినయ్ మద్దినేని తదితరులకు ఎన్నారై టీడీపీ అట్లాంటా చాప్టర్ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.