Connect with us

News

NATS బోర్డు ఛైర్మన్‌గా డల్లాస్ వాసి, సౌమ్యులు కిషోర్ కంచర్ల బాధ్యతల స్వీకరణ

Published

on

Dallas, Texas: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్‌కి ఛైర్మన్‌గా కిషోర్ కంచర్ల కు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది.. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District), గుడివాడ సమీపంలోని రిమ్మనపూడి గ్రామానికి చెందిన కిషోర్ కంచర్ల అటు వ్యాపారం.. ఇటు సేవా రంగంలోనూ దూసుకుపోతున్నారు.

అమెరికాలో ఐటీ ఉద్యోగిగా అడుగుపెట్టిన కిషోర్ కంచర్ల (Kishore Kancharla) ఆ తరువాత బావర్చి పేరుతో రెస్టారెంట్ (Bawarchi Restaurant) వ్యాపారంలోకి ప్రవేశించారు. అనతి కాలంలోనే బావర్చి బ్రాండ్లను అమెరికా అంతటా విస్తరించారు. అటు వ్యాపారంతో పాటు ఇటు సేవా రంగంలో కూడా కిషోర్ కంచర్ల తన సత్తా చాటుతున్నారు. నాట్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న కిషోర్ కంచర్ల ను 2026-27 సంవత్సరాలకు నాట్స్ (NATS) బోర్డు చైర్మన్‌ పదవి వరించింది.

అలాగే ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) కి నాట్స్ బోర్డు ఘనంగా వీడ్కోలు పలికింది. నాట్స్‌ 2.0 ద్వారా కీలక సంస్కరణలు చేపట్టడం.. అమెరికాలో తెలుగువారికి నాట్స్‌ను మరింత చేరువ చేయడం.. నాట్స్ (NATS) ప్రతిష్టను పెంచడం.. వంటి అంశాల్లో ప్రశాంత్ చూపిన చొరవను నాట్స్ బోర్డు ప్రత్యేకంగా అభినందించింది.

error: NRI2NRI.COM copyright content is protected