బాలల దినోత్సవం (Children’s Day, November 14) సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాతీయ “బాల సాహిత్యభేరి” నిర్వహిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న బాలసాహితీవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నారు.
“బాల సాహిత్య భేరి” పేరుతో నవంబర్ 30, 2025 వ తేదీన అంతర్జాతీయ అంతర్జాల శతాధిక బాలకవుల సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవ్యాప్తంగా ఉన్న బాల, బాలికలు “కథ, వచన కవిత, గేయం, పద్యం” విభాగాలలో తమ స్వీయ రచనలను వినిపించాలి. ఒక్కొక్కరికి 3 ని.ల సమయం కేటాయించారు.
5 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న బాల, బాలికలు పైన తెలిపిన విభాగాల్లో ఏదో ఒక విభాగానికి సంబంధించిన తాము రచించిన అంశాలను ఒక పేజీకి మించకుండా వ్రాసి పేరు, ఊరు, తరగతి, దేశం, ఫోన్ # మొదలైన వివరాలను +91.91210.81595 వాట్సాప్ నంబర్ కు గడువుతేదీ నవంబర్ 14లోపు పంపవలెను.
ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 30 న జరిగే తానా (Telugu Association of North America – TANA) అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు, 13 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనే బాల, బాలికలకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తానా (TANA) అధ్యక్షులు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.