కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సహకారంతో తానా క్యూరీ పోటీలు ఏప్రిల్ 28న విజయవంతంగా జరిగాయి. ప్రాంతీయ పోటీలలో భాగంగా నిర్వహించిన గణితం, సైన్స్ మరియు స్పెల్ మాస్టర్ ఛాలెంజ్ విభాగాలలో రెండు నుండి ఏడవ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గెలిచిన విద్యార్ధులకి ట్రోఫీలు, మెడల్స్ బహుకరించారు. అలాగే ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందించారు. మొదటి రెండు స్థానాలలో గెలుపొందినవారు మే 26, 27 తేదీలలో వర్జీనియాలో జరగబోయే జాతీయ పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేసారు.
ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన తానా కార్యవర్గం, క్యూరీ లెర్నింగ్ సెంటర్ నిర్వాహకులు, డెలిగేట్స్, ప్రొక్టార్స్, వాలంటీర్స్, పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులందరికి కేసీటీసీఏ కార్యనిర్వాహకవర్గం తరపున అధ్యక్షులు బిందు చీదెళ్ల కృతజ్ఞతలు తెలియజేసారు.