కాన్సస్ సిటీ తెలంగాణ అసోసియేషన్ (KCTCA) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్సస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలోజరిగిన బతుకమ్మ మరియు దసరా వేడుకలు అంబరాన్ని తాకాయి. ముత్యాల పూల పులకరింతలు, మందార మకరందాలు, బంతి సింగారాలతో ముస్తాబై బతుకమ్మగా పూదొంతరల శిఖరాగ్రాన పూలతో అలంకరించ 10 అడుగుల బతుకమ్మ మరియు అమ్మవారు విగ్రహం మధ్య కొలువుదీరిన గౌరమ్మ మధ్యాహ్నం 4 గంటలకు లలితా సహస్ర నామ పూజతో కార్యక్రమం ప్రారంభమయింది.
ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా సరే దేవుడిని పూజించాలన్నా ప్రార్థించాలన్నా పూలతో కొలుస్తారు. కానీ ఆ పూలనే భగవంతుడి రూపంగా అమ్మవారి ప్రతిరూపంగా బతుకమ్మ గా కొలువడమనేది ఒక్క తెలంగాణ సంస్కృతికే సొంతం. కాన్సస్ హిందు టెంపుల్ కల్చరల్ సెంటర్ హాల్ దీప కాంతుల వెలుగుల్లో ఆడపడుచులందరు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలూ ఆడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు.
రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని ఘనంగా పూజించారు. బతుకమ్మ సంబరాలను ఆటాపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. USA లో నివసిస్తున్న నిహారిక అనే ప్లేబాక్ సింగర్, సుపరిచిత గాయకురాలు నిహారిక ‘ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయే సందమామ’ అంటూ జానపదాల హోరు. బతుకమ్మ సంస్కృతి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలంతా సంప్రదాయ బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు.
బహుళ ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాటలకు బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేశారు. ఈ ఉత్సవాల్లో పిల్లలు పెద్దలు అంతా అందంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. తమ సంస్కృతి మరియు సంప్రదాయాన్ని మరచిపోలేదని నిరూపించారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంపైనా పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ బతుకమ్మ సంబరాలకి బతుకమ్మ ను తయారు చేసుకొని వచ్చిన మహిళలకు ప్రోత్సాహకరంగా వారికి బతుకమ్మ బహుమతులు ఇవ్వడం జరిగినది మరియు పాల్గొన్న మహిళల కి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం ముగిసేసరికి శక్తి మరియు అభిరుచితో మహిళలు బతుకమ్మ ఆట పాటలతో కొనసాగించి బాలికలు పాల్గొనడం కాకుండా, పూజ అనంతరము భక్తులందరికీ పూజలో కంకణాలను బట్టి జమ్మి ఆకు (బంగారం) మరియు ఆక్షింతలు ఇతరులకు ఇచ్చి అలై బలై చేశారు.
అన్ని కుటుంబాలు జమ్మిని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిధుల నుండి దీనెనను తీసుకున్నారు. సుమారు 1500 వందల మంది ఈ ప్రోగ్రాం కి విచ్హేసి సంబరాలలొ బాగమయి ఈ కార్యక్రమన్ని తెలంగాణ లోనే బతుకమ్మ జరుపుకుంటున్నమా అని తలపించె విధముగ ఈ కార్యక్రము ని విజయమంతం చేశారు.
బతుకమ్మను సాగనంపే కార్యక్రమాన్ని ప్రత్యక్ష సాంప్రదాయ తెలంగాణ డప్పు సంగీత వాయిద్యం తో ఊరేగింపుగా తీసుకెళ్ళి కొలనులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమము లో సూర్య, సిరి, రవి అయసోల మరియు ఇంకా కొంత వాలంటీర్లు స్వయంగా భోజనాలు వండటం జరిగింది, మృష్టాన్న భోజనాలతో రాత్రి 9:30 కి పండుగ ముగిసింది. ఈ కార్యక్రమం జరగటానికి సహకరించి దోహద పడ్డ స్పాన్సర్స్ కి KCTCA మరియు TAGKC ప్రత్యేకం గా ధన్యవాదములు తెలుపుకున్నారు.
శ్రీదేవి గొబ్బూరి, వంశీ సువ్వారి, దుర్గా తెల్ల, కిరణ్ కనకదండిల గార్ల అద్యక్షతన మరియు ఇతర KCTCA కార్యవర్గ సభ్యులు సరిత మద్దూరు, సూర్య జగడం, సందీప్ మందుల, సుష్మ చాడ, సరళ కొత్త, జయ కనకదండిల, బిందు చీదెళ్ల, రాజ్ చీదెళ్ల, నీలిమ పూండ్ల, సునీల్, విశ్వా అమ్ముల, వాసు తలగడదీవి, వెంకట్ రావ్, వెంకట్ మండ మరియు TAGKC కార్యవర్గసభ్యులు నరేందర్ దుద్దెల, చంద్ర యక్కాలి, సరిత రాయన్నగారి, మధు గంట, శ్రావణి మేక, ప్రశాంత్ ఠాకుర్, విజయ్ రాగిని, శ్రీని పెనుగొండ, శివ తియాగుర, శరత్ టేకులపల్లి, సతీష్ మీసా, శ్రీనుకుమార్ గాడిరాజు, మరియు పద్మజ సరిపల్లి, సిరి తుమ్మ, రూప బసు, విజయ్ కొండి, సుచరిత వాసం గార్ల సహకారంతో మరియు 50 మంది ఇతర వలంటీర్ల సమిస్టి క్రుషితో ఈ కార్యక్రమం అద్భుతం గా జరిగింది.
కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (Kansas City Telangana Cultural Association) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్సస్ సిటీ (Telugu Association of Greater Kansas City) ఆర్గనైజషన్స్ మొదటి సారి సంయుక్తంగా జరిపిన బతుకమ్మ మరియు దసరా పండుగ వేడుకలు దిగ్విజయంగా జరిగినందుకు సభికులకు ధన్యవాదాలు తెలిపారు.