Connect with us

Events

Kansas City: పూదొంతరల శిఖరాగ్రాన KCTCA బతుకమ్మ & దసరా వేడుకలు

Published

on

ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా సరే దేవుడిని పూజించాలన్నా ప్రార్థించాలన్నా.. పూలతో కొలుస్తారు. కానీ ఆ పూలనే భగవంతుడి రూపంగా అమ్మవారి ప్రతిరూపంగా బతుకమ్మ (Bathukamma) గా కొలువడమనేది ఒక్క తెలంగాణ (Telangana) సంస్కృతికే సొంతం.

కాన్సాస్ హిందు టెంపుల్ కల్చరల్ సెంటర్ (Hindu Temple & Cultural Center of Kansas City) హాల్ దీప కాంతుల వెలుగుల్లో ఆడపడుచులందరు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలూ ఆడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు. కాన్సాస్ సిటి తెలంగాన అసోసియెషన్ (Kansas City Telangana Cultural Association) కాన్సాస్ సిటీ ఆద్వర్యములొ జరిగిన బతుకమ్మ మరియు దసర (Dasara) వేడుకలు అంబరాన్ని తాకాయి.

ముత్యాల పూల పులకరింతలు.. మందార మకరందాలు.. బంతి సింగారాలతో ముస్తాబై.. బతుకమ్మగా పూదొంతరల శిఖరాగ్రాన పూలతో అలంకరించ 9 అడుగుల బతుకమ్మ మరియు అమ్మవారు విగ్రహం మధ్య కొలువుదీరిన గౌరమ్మ, మధ్యాహ్నం 4:00 గంటల ప్రాంతం లో కాన్సాస్ (Kansas City) బాలసుబ్రమణ్యం గా ప్రసిద్ధి పొందిన విశ్వ మోహన్ అమ్ముల గారిచే స్వాగత గీతంతో ప్రారంభమయి లలిత సహస్ర నామ పూజతో రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని ఘనంగా పూజించారు.

బతుకమ్మ సంబరాలను ఆటాపాటాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాదు లో నివసిస్తున్న విద్యాానంద చారి సుపరిచిత జానపద గాయకులు ఎన్నెనో జానపదాల హోరు.. బతుకమ్మ సంస్కృతి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలంతా సంప్రదాయ బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు. ఈ వేడుక లో కాన్సాస్ సెనెటర్ శ్రీమతి ఉష రెడ్డి దంపతులు పాల్గొన్నారు.బహుళ ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాటలకు బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేశారు.

ఈ Kansas City Telangana Cultural Association (KCTCA) ఉత్సవాల్లో పిల్లలు పెద్దలు అంతా అందంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. తమ సంస్కృతి మరియు సంప్రదాయాన్ని మరచిపోలేదని నిరూపించారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంపైనా పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం ముగిసే సరికి శక్తి మరియు అభిరుచితో మహిళలు బతుకమ్మ ఆట పాటలతో కొనసాగించి బాలికలు పాల్గొనడం కాకుండా, పూజ అనంతరము భక్తులందరికీ జమ్మి ఆకు (బంగారం) అందించారు. అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిధుల నుండి దీనెనను తీసుకున్నారు. సుమారు వెయ్యి మంది వేడుక కి విచ్హేసి సంబరాలలొ బాగమయి ఈ కార్యక్రమన్ని తెలంగాణ లోనే బతుకమ్మ జరుపుకుంటున్నమా అని తలపించె విధముగ విజయవంతం చేసారు.

బతుకమ్మ (Bathukamma) సాగనంపే కార్యక్రమాన్ని ప్రత్యక్ష సాంప్రదాయ తెలంగాణ డప్పు సంగీత వాయిద్యం తో ఊరేగింపుగా తీసుకెళ్ళి కొలనులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమములో అలంకరణ విభాగం లో పద్మజ సారిపల్లి గారు, హన్మంత్ రావు సారిపల్లి గారు, విజయ్ కొండి గారు, రాజ్ చీడేల్ల గారు, జయ కనకదండిల గారు, సుష్మ చాడ గారు, విజయ్ దుగిని గారు, ప్రశాంత్ ఠాకూర్ గారు అద్భుతంగా వేదిక ను, బతుకమ్మను అలంకరించారు.

ముఖ్యంగా శ్రీనివాస్ తలగడ దీవి గారు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేశ (Eco Friendly Lord Ganesh) భావితరాల కి ఒక ప్రత్యేక ఉదాహరణ గ నిలిచింది. భోజన విభాగంలో సూర్య జగడం గారు, సిరి జగడం గారు, రవి అయసోల గారు, కిరణ బూసి గారు, లక్ష్మి గారు, కావ్య గారు, అవినాష్ గారు మరియు ఇంకా కొంత వాలంటీర్లు స్వయంగా భోజనాలు వండటం జరిగింది. విందు భోజనాలతో కార్యక్రమం రాత్రి 9:30 కి ముగిసింది.

వడ్డన విభాగంలో వెంకట్ మంత్రి గారు, ప్రసాద్ ఇసుకపల్లి గారు, రవి గుమ్మడిపూడి గారు, స్తానిక విద్యార్థులు మరియు ఇంకా కొంత వాలంటీర్లు సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా మహతి మంద గారు మరియు నీలిమ పూండ్ల గారు వ్యవహరించారు. తెలంగాణ సంస్కృతి (Telangana Culture) ని గుర్తింప చేసేలా చిన్నారులు నాట్య ప్రదర్శన కనులకు విందుగ నిలిచింది. ఈ కార్యక్రమం జరగటానికి సహకరించి దోహద పడ్డ స్పాన్సర్స్ కి KCTCA ప్రత్యేకం గా ధన్యవాదములు తెలుపుకున్నారు.

సరిత మద్దూరు (Saritha Madduru), కిరణ్ కనకదండిల గార్ల అద్యక్షతన మరియు ఇతర కార్యవర్గ సభ్యులు సూర్య జగడం, సందీప్ మందుల, సుష్మ చాడ, సరళ కొత్త, జయ కనకదండిల, శ్రీదేవి గొబ్బూరి, బిందు చీదెళ్ల, రాజ్ చీదెళ్ల, నీలిమ పూండ్ల, పద్మజ సారిపల్లి, సిరి జగడం, విజయ్ కొండి, విశ్వా అమ్ముల, వాసు తలగడదీవి, వెంకట్ రావ్, వెంకట్ మండ, ప్రశాంత్ ఠాకూర్ మరియు 20 మంది వాలంటీరుల సమిష్టి ఖ్రుషి తో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (KCTCA) బతుకమ్మ, దసరా పండుగ వేడుకలు దిగ్విజయంగా జరిగినందుకు సభికులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected