కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణానంతర పూజా కార్యక్రమాలలో భాగంగా వేద పండితుల నడుమ శాస్త్రోక్త పూజలు, హోమాలతో వినాయకుని చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం ఐదవ రోజుకు చేరింది.
ఐదవ రోజు ఆగష్టు 19 న ఉదయం చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, హస్త్ర హోమం, దిశా హోమం, అగ్ని సంగ్రహణం మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం సోమకుంభపూజ, కుంభాలంకారం, కళాకర్షణం మొదలగు పూజలు నిర్వహించారు.
సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో స్వామిని కొలుస్తూ భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. పూజలు, వేద మంత్రాలు, హోమాలు, భక్తి కార్యక్రమాలు ఇలా వివిధ మార్గాల్లో భక్తులు మరియు దాతలు శ్రీనివాస్ గుత్తికొండ గారు, రవి ఐకా గారు భక్తి శ్రద్ధలతో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కొలిచారు.
ఈ ఐదవ రోజు పూజా కార్యక్రమాలలో దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం కార్యనిర్వహణధికార శ్రీ సురేష్ బాబు గారు, ఆలయ పునర్నిర్మాణ దాతలు రవి ఐకా గారు, శ్రీనివాస్ గుత్తికొండ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఆలయ ఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.