కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భాగంగా ఆగష్టు 15 సోమవారం నుండి ఆగష్టు 21 ఆదివారం వరకు ఏడు రోజులపాటు పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రెండవ రోజు మంగళవారం ఆగష్టు 16 న పూజలలో ఆలయ పునర్నిర్మాణ దాతలు శ్రీనివాస్ గుత్తికొండ గారు, రవి ఐకా గారు మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు తదితరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
ఉదయాన్నే వేద స్వస్తి, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, గణపతి హోమం, చతుర్వేద హవనం, మంత్రపుష్పం, మొదలగును పూజలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం చతుర్వేద పారాయణం, కలశధారణ, లఘు పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పము, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దాతలతోపాటు ఇంకా ఈఈ వెంకట నారాయణ, ఏసీ కస్తూరి, ఏఈఓ కృష్ణారెడ్డి, ఆలయ పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీనివాస్, అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. పూజలు అనంతరం దాతలు నూతన ఆలయాన్ని పరిశీలించారు.