Connect with us

News

తానా 23వ మహాసభలకు విశిష్ట అతిథిగా హార్ట్‌ఫుల్‌నెస్ ‘దాజి’ కమలేష్ పటేల్

Published

on

ఆధ్యాత్మికత కోసం విశేష కృషి చేస్తున్నందుకు కమలేష్ డి. పటేల్‌కు పద్మభూషణ్‌ (Padma Bhushan) ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో కమలేష్ డి. పటేల్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు.

హార్ట్‌ఫుల్‌నెస్ (Heartfulness Meditation) మూవ్‌మెంట్ స్థాపకులు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటైన కన్హ శాంతి వనాన్ని అభివృద్ధి చేసి విశేష సేవలందిస్తున్న దాజీకు పద్మభూషణ్ సత్కారం లభించడం పట్ల తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి హర్షం వ్యక్తం చేశారు.

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంగరంగవైభవంగా నిర్వహించనున్న తానా 23వ మహాసభలకు (Conference) విశిష్ట అతిథిగా దాజి (Kamlesh D Patel) హాజరవుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected