నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ లో ప్రజల అవసరాలను గమనించిన కార్పొరేటర్ కృష్ణ కర్నాటి, నాగేశ్వరరావు బండి తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్ళూరి దృష్టికి తీసుకెళ్లారు. దాతగా జయ్ తాళ్ళూరి సమ్మతి తెలుపగానే మున్సిపల్ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు.
దీంతో వెంటనే తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ మరియు డిస్ట్రిక్ట్ NRI ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాళ్లూరి భారతీదేవి ఙ్ఞాపకార్ధం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ మీద వాటర్ ప్లాంట్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. 4 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ వాటర్ ప్లాంట్ ప్రతి రోజూ 4 వేలమందికి ఉపయోగ పడనున్నది.
ఈరోజు లకారం ట్యాంక్ బండ్ మీద జయ్ తాళ్ళూరి, సుడా చైర్మన్ విజయకుమార్ బచ్చు, శ్రీ మిత్ర ఫౌండేషన్ ప్రవీణ్ కురువెళ్ళ, డిస్ట్రిక్ట్ NRI ఫౌండేషన్ బాధ్యులు రామకృష్ణ బోనాల, రంగారావు పసుమర్ధి, పువ్వాడ ట్రస్ట్ కిరణ్, KLC రవి దొడ్డా, తాళ్ళూరి భారతీదేవి చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ వంశీ కృష్ణ వల్లూరుపల్లి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. అనుదినం సుందరంగా రూపు దిద్దుకుంటున్న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది అని, రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో సందర్శకుల అవసరాలను తీర్చే అవకాశం రావడం తన అదృష్టమని, తన తల్లి గారు శ్రీమతి బారతీదేవి ఙ్ఞాపకార్ధం ఈ సహాయం చేసే అవకాశం దక్కడం తమ కుటుంబానికి గౌరవమని అన్నారు.
అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్, డిస్ట్రిక్ట్ NRI ఫౌండేషన్ సంయుక్తంగా ముందుకు వచ్చి ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి పూను కోవడం అభినందనీయం అని సుడా ఛైర్మన్ విజయ్ కుమార్ బచ్చు, కృష్ణ కర్నాటి దాతలను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో DNF సభ్యులు కృష్ణారావు దొడ్డపనేని, అర్జునరావు వాసిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.