Connect with us

Service Activities

భద్రాచల ప్రభుత్వ కళాశాలలో అన్ని హంగులతో ఆడిటోరియం నిర్మాణం: Jay Talluri

Published

on

మనం పుట్టి పెరిగిన ఊరికి, మనం చదువుకున్న విద్యాలయానికి సేవ చేసే భాగ్యం వస్తే మాత్రం అదొక వరంలా భావించాలి. మనకు వీలైనంతలో చేయగలిగిన సహాయం చేయాలి. ఎందుకంటే మన ఆటోగ్రాఫ్ జ్ఞాపకాల దగ్గిర నుండి ఈరోజు ఒక స్థాయికి వచ్చేలా తీర్చి దిద్దిన మహత్తర దేవాలయాలు అవి.

ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి మరోసారి ముందుకొచ్చారు. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ (Talluri Panchaksharaiah Charitable Trust) ద్వారా తన తల్లిదండ్రుల పేరు మీద తను చదువుకున్న తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని భద్రాచల ప్రభుత్వ కళాశాలలో ఆడిటోరియం నిర్మించారు.

గత ఇండియా ట్రిప్ లో జయ్ తాళ్లూరి (Jay Talluri) కుటుంబ సభ్యులందరూ సకుటంబంగా వెళ్లి మరీ ఆడిటోరియం ప్రారంభించడం విశేషం. ఈ ఆడిటోరియం భద్రాచల ప్రభుత్వ కళాశాల (Government Junior College) విద్యార్థులకే కాకుండా భద్రాచలం పట్టణంలోని అన్ని వర్గాలవారికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.

ఈ ఆడిటోరియం (Auditorium) లోనే భద్రాద్రి కళాభారతి (Bhadradri Kalabharathi) సంస్థ వారు నిర్వహించే అంతర్ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ఈ మధ్యనే ఘనంగా నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలకు తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాలుగా స్పాన్సర్ చెయ్యడం అభినందనీయం.

నాటకోత్సవ సాంస్కృతిక సంబరాలలో ముఖ్య అతిథిగా గా పాల్గొన్న జయ్ తాళ్లూరి నాటక రంగ కళాకారులను సత్కరించారు. ఈ సభలో ప్రసంగిస్తూ… భద్రాచల (Bhadrachalam) ప్రభుత్వ కళాశాలలో నిర్మించిన ఆడిటోరియం ఈ విధంగా ఉపయోగపడడం సంతోషంగా ఉందని, మొదటినుంచి కూడా నాటకరంగం సభ్యసమాజానికి మంచి సందేశాలందిస్తుందని జయ్ తాళ్లూరి కొనియాడారు.

జయ్ తాళ్లూరి తండ్రి, ప్రముఖ సంఘ సేవకులు, భద్రాద్రి కళాభారతి గౌరవ అధ్యక్షులు తాళ్లూరి పంచాక్షరయ్య (Talluri Panchaksharaiah) మాట్లాడుతూ… అంతరించిపోతున్న నాటక కళలను బతికించుకోవలసిన భాద్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. మార్పు ఒకచోట మొదలైతే వాటి ప్రతిఫలాలు ఏదో ఒక రోజు అందరికీ అందుతాయన్నారు.

భద్రాచల ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో అందరికీ ప్రాయోజితమైన ఇటువంటి మంచి ప్రాజెక్ట్ విషయంలో సహకరించిన భద్రాద్రి కళాభారతి వ్యవస్థాపకలు అల్లం నాగేశ్వరరావు మరియు వారి టీంకి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ (Telugu Association of North America – TANA) మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected