Connect with us

News

డిప్యుటీ CM గారి తాలుకా; Houston జనసైనికుల విజయభేరి

Published

on

“మనల్నెడ్రా ఆపేది” అంటూ మొదలైన హ్యూస్టన్ జనసైన్యం జనసేన విజయభేరి సంబరాలను కళ్యాణ్ చివుకుల, రాజేష్ యాళ్ళబండి (Rajesh Yallabandi), వెంకట్ శీలం ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ విజయోత్సవ సంబరాలకు సుమారు మూడు వందలకు పైగా హ్యూస్టన్ జనసేన (Houston Janasena) కార్యకర్తలు, వీరమహిళలు, పెద్దలు, చిన్నారులు విచ్చేశారు. జగన్ రాయవరపు, వెంకట్ నాగబాబు కూనసాని, లోవా నాగబాబు రామిశెట్టీ గార్లు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయడం జరిగింది.

జనసేన జండాకి ప్రత్యేక జండా స్తంభం ఉన్న జనసేన హ్యూస్టన్ పార్టీ ఆఫీస్ శ్రీ. కళ్యాణ్ చివుకుల గారి రేంచ్ హౌస్ (Ranch House) లో జనసేన జెండా వందనంతో మొదలైన ఈ కార్యక్రమంలో, హ్యూస్టన్ కు విచ్చేసిన Visiting Parents సమక్షంలో జనసేన జెండాను ఘనంగా, గర్వంగా ఎగరవేశారు. “మీరెవరు తాలుకా, డిప్యుటీ CM గారి తాలుకా”, “బాబులకే బాబు కళ్యాణ్ బాబు”, “మనల్నెడ్రా ఆపేది, జై జనసేన, జై కూటమి, జై టి.డి.పి, జై ఎన్.డి.ఏ”… వంటి నినాధాలతో ఈ జనసేన జండా వందనం అట్టహాసంగా జరిగిందనడం అతిశయోక్తి కాదు.

సుమారు వందకు పైగా కార్ల తో జరిగిన కార్ ర్యాలీ (Car Rally) కి మంచి స్పందన రావడం విశేషం. కళ్యాన్ చివుకుల గారి రేంచ్ హౌస్ నుండి మొదలైన ఈ కార్ ర్యాలీ డిప్యుటీ CM గారి తాలుకా కార్ స్టిక్కర్లతో (Jagan Rayavarapu), జనసేన పార్టీ జెండాలతో కోలాహాలంగా జరిగింది. ఆట్టహాసంగా జరిగిన ఈ కార్ల ర్యాలీని డ్రోన్ కేమేరాలతో చిత్రీకరించడం జరిగింది. పదిమైళ్లకు పైగా జరిగిన ఈ కార్ ర్యాలి ఘనంగా సభాస్థలి లుంబ్రే క్లబ్ (Sujith Alahari) వరకూ జరిగింది. జనసేన పార్టి Official Song తో మొదలైన ఈ కార్యక్రమం చిన్నారులు, వీరమహళలు, కార్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తల సమక్షంలో ప్రారంభమైంది.

శ్రీ. రాజేష్ యాళ్ళబండి గారు జనసైనికులకు స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంబించారు. జనసేన హ్యూస్టన్ (Houston Janasena) ప్రయాణాన్ని ఈ పది సంవత్సరాలుగా రవి వర్రె, బద్రుద్ధీన్ పిత్తర్, రమేష్ వడ్లమాని, గోపాల్ గూడపాటి మరియూ మరిందరు పెద్దలు వేసిన తొలి అడుగులతో ఏ విదంగా పార్టీ పెద్దలతో పనిచేయడం, 2019 ఎన్నికలకు 19 నియోజకవర్గాలను దత్తత తీసుకుని ఈ విదంగా కార్యకర్తలతో, నాయకులతో మరియూ శాసనసభ అభ్యర్ధులతో పనిచేయడం, ఈ ఎన్నికలలో అభ్యర్థులందరితోను నియోజకవర్గ స్థాయిలో పనిచేయడం, 2018 డల్లాస్ లో జరిగిన కళ్యాణ్ (Pawan Kalyan) గారి ప్రవాసగర్జన ను హ్యూస్టన్ నుండీ సహకరించడమూ వివరించారు.

విజయదుంధుభి ప్రకటించిన జనసేన (Jana Sena Party – JSP) 21 శాసన సభ్యులను, ఇద్దరు పార్లమెంట్ సభ్యులనూ అభినందించారు. క్షేత్రస్థాయిలో పనిచేసి మన శాసనసభ (Assembly Constituencies) నియోజకవర్గాల్లో కూటమి నాయకులను గెలిపించుకోవడానికి హ్యూస్టన్ నుండి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికలకు వెళ్ళిన గంగాధర్ మోసూరు (వైజాగ్ వెస్ట్), సురేష్ సత్తి (పోలవరం), క్రిష్ణ గొంతిన (గాజువాక) మరియు సాయి రాజ్ కొత్తమాసు (మచిలిపట్నం) గార్లకు ఈ సభాముఖంగా ధన్యవాధములు తెలియజేయడమైనది.

శ్రీ. వెంకట్ శీలం గారు మాట్లాడుతూ జనసేన (Jana Sena Party) శ్రేణులను ప్రతీ కార్యకర్తనూ అభినందించారు. రాబోయే రోజుల్లో జనసైనికులపై మరింతగా బాధ్యతలు ఉండబోతున్నాయని, ప్రజాశ్రేయస్సు మరియూ రాష్ట్రాభివృద్ధి జనసేనతోనే సాధ్యమని ఆకాంక్షించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు తెలియజేశారు. తాము 2019 ఎన్నికలలో హ్యూస్టన్ జనసేన తరుపున 19 నియోజకవర్గాలను దత్తత తీసుకుని క్రియాశీల బాధ్యతలు చేపట్టిన శేషాద్రి మంచెం, రాజేష్ యాళ్ళబండి మరియూ జనసేన కోఆర్డినేటర్లందరికీ ధన్యవాధములు తెలియజేశారు.

శ్రీ. నాగబాబు కూనసాని మాట్లాడుతూ కూటమి కుటుంబ సభ్యులందరినీ అభినందించారు. రాష్ట్ర ప్రగతికి ప్రతీ జనసైనికుడూ పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆద్యంతం సహకరించిన శ్రీ. కళ్యాన్ చివుకుల గారిని ఈ వేధికపై సత్కరించడమైనది. మనల్నెడ్రా ఆపేది అంటూ మొదలైన శ్రీ. కళ్యాన్ చివుకుల గారు జనసేనాని శ్రీ. పవన్ కళ్యాణ్ గారిని నీ, నాయకత్వాన్ని, జనసేన (Janasena) రధసారధులైన ప్రతీ కార్యకర్తకూ అభినందనలు అభినమందనలు తెలియచేశారు.

ప్రధాని శ్రీ. నరెంద్ర మోడి (Narendra Modi) గారికి, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) గారికి మరియూ కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీకి, రాష్ట్రాభివృద్ధికీ NRI ల తరుపున తన సంపూర్ణ సహకారాన్ని అందించడానికి సంసిద్దత వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారాన్నందించిన తరుణ్ పురాణం, గిరిధర్ గత్తా మరియూ S.B.S Corp టీం కు తన హౄదయపుర్వక ధన్యవాధములు తెలియచేశారు.

శ్రీ. పులపర్తి రామాంజనేయులు గారు (భీమవరం నియోజకవర్గ MLA), శ్రీ. పంచకర్ల సందీప్ గారు (భీమిలి ఇన్-చార్జ్), శ్రీ. బొమ్మిడి నాయకర్ గారు (నరసపురం నియోజకవర్గ MLA), శ్రీ. సంతోష్ దాచేపల్లి గారు (తెలంగాణా జనసేన నాయకులు), జగదీష్ అందే మరియూ జనసేన పార్టీ ముఖ్య నాయకులు జూం కాంఫరెన్స్ కాల్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు కూనసాని గారి కోఆర్డినేషన్ లో జూం కాంఫరెన్స్ కాల్ ద్వారా సభనుద్దేశించి ప్రసంగించిన జనసేన (Janasena) నాయకులకు వెంకట్ శీలం గారు ధన్యవాధములు తెలియజేశారు.

భీమవరం నియోజకవర్గ MLA శ్రీ. పులపర్తి రామాంజనేయులు గారు జనసేన విజయంలో కీలకపాత్ర పోషించిన ఎన్.ఆర్.ఐ లను అభినందించారు. నరసపురం MLA శ్రీ. బొమ్మిడి నాయకర్ గారు కూటమి విజయంలో హ్యూస్టన్ ఎన్.ఆర్.ఐ (Houston NRIs) లు ఘనణీయమైన పాత్ర పోషించారని అభినందించారు. సందీప్ పంచకర్ల గారు మాట్లాడుతూ, ఎన్.ఆర్.ఐ లు జనసేన పార్టీని కఠోర శ్రమతో పనిచేసి జనసేన మరియు కూటమికి ఘనవిజయాన్ని చేకూర్చారన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా తనకు వచ్చే పెన్షన్ డబ్బులన్నిటినీ జనసేన పార్టీ (Jana Sena Party) కి విరాళముగా అందచేస్తున్న పెద్దలు శ్రీ. మస్తాన్ రావు గారిని (హ్యూస్టన్ వాస్తవ్యులు శ్రీ. రెమినిశెట్టి దుర్గా ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి భారతి గారి తండ్రిగారు) సభాముఖంగా అభినందిస్తూ సత్కరించడమైనది. శ్రీ. వీరభద్ర రావు కంబాల గారు ప్రతీ జనసేన కార్యకర్తకూ అభినందనలు తెలియజేశారు. డాక్టర్. సూర్యా రగుతు గారు జనసేన మరియు కూటమి నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

డాక్టర్. వెంకట్ వీరిశెట్టి గారు శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి వ్యూహాన్ని, ఎన్నికలలో ఘనవిజయాన్నీ కొనియాడారు. డాక్టర్. మురళి ద్రాక్షారామం గారు హ్యూస్టన్ జనసైన్యం కార్యకర్తలను అభినందించడమైనది. శ్రీ. నరేష్ మద్దింశెట్టి గారు క్షేత్ర స్థాయిలో కష్టపడ్డ కూటమి సభ్యులందరికీ ధన్యవాధములు తెలియుజేశారు. శ్రీ. శ్రీనివాస్ నరలశెట్టి గారు క్షేత్ర స్థాయిలో కష్టపడ్డ జనసేన కార్యకర్తలు మరియు కూటమి సభ్యుల వలనే ఈ ఘనవిజయం సాధమైనదని ప్రశంసించారు. శ్రీ. సుజిత్ అలహరి (Lumbre రెస్టారెంట్) జనసేన కార్యకర్తలకు మరియు కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ. రాజేష్ గుగ్గిల్ల (బాల్కొండ నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్) గారు ఆంధ్రప్రదేశ్ నూతన శాశన సభ్యులకు, నూతన మంత్రివర్గానికీ శుబాభినందనలు తెలియజేశారు. తెలంగాణా జనసేన (Telangana Janasena) కార్యకలాపాలను ఈ సందర్భంగా వివరించారు. హ్యూస్టన్ జనసైనికుల ఆప్త మిత్రుడు, జాక్సన్ మిస్సిస్సిపి నుండి జనసేన గెలుపుకై క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి ఇండియాకు వెళ్ళి అక్కడ హఠాన్మరణం పాలైన జనసేన కార్యకర్త శ్రీ. విజయ్ కటకం గారికి ఈ సభాముఖంగా నివాళులర్పించడమైనది. జనసేన అఖండవిజయంలో శ్రీ. విజయ్ గారి వంటి అమరుల త్యాగం వెకట్టలేనిదని సభికులు అశ్రునివాళులర్పించారు.

హ్యూస్టన్ (Houston) కూటమి నాయకులు పూర్ణ లంక మరియు చంద్రకాంత్ జంపాల (TDP), శివ లోహిత్ గంగరాజు మరియూ రాఘవ ఇంగాల (BJP) కూటమి నాయకులకు, నూతన శాశన సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడమైనది. నవాబ్స్ బిర్యానీ హౌస్ శ్రీ. ప్రతాప్ రెడ్డి అలవల గారు మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చరిత్రలోనే ఐదు పోర్టుఫోలియోలు తీసుకున్న మంత్రివర్యులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమానికి రుచికరమైన్ ఆంధ్ర స్నాక్స్ మరియు డిన్నర్ శ్రీ. ప్రతాప్ రెడ్డి అలవల గారి నవాబ్స్ బిర్యానీ హౌస్ స్పాన్సర్ చేయడమైనది.

“డిప్యుటీ CM గారి తాలుకా” డిజైన్ (విజయ్) తో చేయబడ్డ కేక్ ను వీరమహిళలు, చిన్నారులు కట్ చేయడమైనది. ఈ కార్యక్రమానికి శ్రీ. వెంకట్ దంతాల గారు సహకరించారు. సభాస్థలిని స్పాన్సర్ చేసిని శ్రీ. సుజిత్ అళహరి ఈ కార్యక్రమంలో సత్కరించడమైనది. డిజే వినోద్ ఈ కార్యక్రమానికి ఆడియో వీడియో సహకారాన్ని అందించడమైనది. సభికులందరూ శ్రీ. కళ్యాణ్ చివుకుల గారిని, సుజిత్ అళహరి గారిని ఈ కార్యక్రమాన్ని ఆధ్యాంతమూ సహకరించి స్పాన్సర్ చేసిన సందర్భంగా ధన్యవాదములందించారు.

ఈ విజయోత్సవ (Victory Celebrations) సభ ఘన విజయానికి సహకరించిన వీరమహిళలందరికీ మరియు గిరిధర్ గుత్త, తరుణ్ పురాణం, కిరణ్ జలకం, నరేష్ దేశిరెడ్డి, సందీప్ రామినేని, రోహిత్ పెదమల్లు (Austin), వీరా నల్లం, వీరా నల్లమల్లి, రాంబాబు ఆడబాల, రోహిత్ బడే, మోహన్ చింతాల, బాలా బొరుసు, ప్రశాంత్ మన్నే, అశోక్ మామిడీ, శ్రీనివాస్ సుంకర, చైతన్య కుచిపుడి, క్రిష్ణ సనక, పవన్ నాయిని, యశస్వి మద్దాల, రోహిత్ నవ్వల, రఘు రాజనాల, స్వామీ యాళ్ళబండి, దినేష్ వాసిరెడ్డి, విఠల్, సాంబా మేరుగ, లక్ష్మన్, శివాజి చింతా, సురేష్ లింగినేని (డల్లాస్), సురేష్ కరోతు (అట్లాంటా), మౌనిష్, శ్రీకంత్ అద్దెపల్లి, కరణం వరహాలు, హ్యూస్టన్ జనసైన్యం కార్యకర్తలను అభినందించడమైనది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected