ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association) ‘నాటా’ మూడు రోజుల కన్వెన్షన్ విజయవంతంగా ముగిసింది. ఏర్పాట్లకు తగ్గట్టుగానే మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్, రెండవ రోజు తమన్ షో, మూడవ రోజు దేవి శ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్ ఆహతులను ఆకట్టుకున్నాయి.
డల్లాస్ లో నిర్వహించిన ఈ నాటా కన్వెన్షన్ లో వివిధ అవార్డులతో పలువురు ప్రముఖులను సత్కరించారు. ఇందులో భాగంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ గట్టు ను నాటా (NATA) నాయకులు బిజినెస్ విభాగంలో ఘనంగా సత్కరించారు.
డిజిటల్ టెక్నాలజీస్ లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా జగదీశ్వర్ గట్టు ను నాటా (North American Telugu Association) సన్మానించింది. నాటా కన్వెన్షన్ వేదిక పైకి సగౌరవంగా ఆహ్వానించి అవార్డు మెమెంటో, శాలువా మరియు పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గట్టు (Jagadeshwar Gattu) మాట్లాడుతూ నాటా కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకి బిజినెస్ విభాగంలో ఈ అవార్డు రావడం, అందునా ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association) నాటా కన్వెన్షన్ వేదికపై అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.