Connect with us

Education

F1 అడ్మిషన్స్, కాలేజీ ట్రాన్స్ఫర్స్, CPT ప్రోగ్రామ్స్, తక్కువ ఫీజుల ప్రత్యేకతలతో Orion Technical College @ Davenport, Iowa

Published

on

Davenport, Iowa: అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నత చదువుల కోసం ముఖ్యంగా మాస్టర్స్ డిగ్రీ పట్టా కోసం వివిధ దేశాల నుంచి F1 వీసా మీద విద్యార్థులు వస్తుంటారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు బాగుండడం మరియు జీవన సరళి కూడా ఆశాజనకంగా ఉండడం వంటివి కొన్ని కారణాలు.

కారణాలు ఏమైనప్పటికీ అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునేవారు మూడు రకాలు ఉంటారు. కొత్తగా F1 వీసా (F1 Admission) మీద వచ్చేవాళ్ళు ఒక రకం అయితే, వచ్చాక కాలేజీ నచ్చక లేక ఫీజు, CPT లభ్యత వంటి ఇతరత్రా కారణాలతో మరొక కాలేజీకి ట్రాన్స్ఫర్ (University Transfer) అయ్యేవాళ్ళు మరొక రకం.

ఒక మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ లైఫ్ లో భాగంగా H1B వీసా పిక్ అవ్వకపోయినా లేదా రిజెక్ట్ అయినవారు లీగల్ గా అమెరికాలో ఉండాలని వీసా స్టేటస్ (Immigration Status) మైంటైన్ చెయ్యడానికి మళ్ళీ మరొక మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యేవారు మూడో రకం. వీరు మొదటి రెండు రకాలతో పోలిస్తే తక్కువ ఉంటారు.

ఇలా అన్ని రకాలవారికి ఉపయోగపడేలా అమెరికాలోని అయోవా (Iowa) రాష్ట్రం, డావెన్పోర్ట్ (Davenport) నగరంలోని ఒరియన్ టెక్నికల్ కాలేజ్ (Orion Technical College) అందరినీ ఆకర్షిస్తుంది. CPT (Curricular Practical Training) ప్రోగ్రామ్స్ పాఠ్యప్రణాళికలో ఉండడం మరియు ఫీజులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ (Cost of Living) ఇందుకు కొన్ని కారణాలు మాత్రమే.

లేటెస్ట్ గా ట్రెండ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), బిజినెస్ అనలైటిక్స్ (Business Analytics) మరియు కంప్యూటర్ సైన్స్ (Computer Science) వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ప్రావీణ్యం సాధించేలా మాస్టర్స్ డిగ్రీ అడ్మిషన్స్ ఒరియన్ టెక్నికల్ కాలేజీలో అందుబాటులో ఉండడం ముఖ్య కారణం.

ACCSC (Accrediting Commission of Career Schools and Colleges) అక్రెడిటేషన్ ఉండడం, బ్రేక్ లేకుండా 9 కోర్సులు మరియు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే దాదాపు 20 నెలల్లోనే మాస్టర్స్ డిగ్రీ (Master’s Degree) పూర్తి చేసే అవకాశం ఉండడం, వేరే కాలేజీ నుండి కోర్స్ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉండడం, అనువైన ఫీజ్ పేమెంట్ ఆప్షన్స్ విశేషం.

మొదటి సెమిస్టర్ నుంచే CPT లభ్యత అవకాశం, అకడమిక్ సలహాలు, రెస్యూమె డెవలప్మెంట్ (Resume Development) వంటి స్టూడెంట్ సేవలు, ఆన్లైన్ మరియు ఇన్ పర్సన్ కోర్సుల కాంబినేషన్ తో హైబ్రిడ్ ప్రోగ్రామ్స్, స్కాలర్షిప్స్, లోన్స్, గ్రాంట్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ వంటి ప్రత్యేకతలు ఒరియన్ టెక్నికల్ కాలేజ్ (Orion Technical College) సొంతం.

2025 మే 1వ తారీఖు నుంచి నెక్స్ట్ సెమిస్టర్ మొదలవుతుంది. బ్రోచర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అయోవా (Iowa) రాష్ట్రం, డావెన్పోర్ట్ (Davenport) నగరంలోని ఒరియన్ టెక్నికల్ కాలేజ్ (Orion Technical College) కి సంబంధించి మరిన్ని వివరాల కోసం www.orion.edu ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected