వాసవి సవా సంఘ్ అట్లాంటా (Vasavi Seva Sangh Atlanta) వారి ఆధ్వర్యంలో “ఓ మహిళా నీకు వందనం” నానుడితో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మన జీవితాన్ని అందంగా నిర్మించిన ప్రేమ మూర్తులకు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఘనంగా తెలియచేసారు.
ప్రతి స్త్రీ తన కలల సాకారానికి, ఆనందానికి అర్హురాలు. అలాంటి స్త్రీలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పలువురు అంతర్జాతీయ మహిళా దినోత్సవ (International Women’s Day) శుభాకాంక్షలు తెలియచేసారు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని ప్రేమించు… ముఖ్యంగా… మహిళను గౌరవించు.
ఓర్పులో, నేర్పులో తనకు తానే సాటి స్త్రీ. భూదేవి సహనం, రుద్రమ దేవి పరాక్రమం, సీతాదేవి సౌశీల్యం ఉన్న మేటి స్త్రీ. ఆమె కర్త, ఆమె సాధకురాలు, ఆమె విశ్వాసి. ఆమెను గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ అని ఘంటా పదంగా వాసవి సవా సంఘ్ (Vasavi Seva Sangh) ప్రతినిధులుతెలియహేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు చేసిన నృత్యాలు, ఫ్యాషన్ షోలు మరియు పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఇవేకాకుండా నేటి ఉరుకుల ప్రపంచంలో ముందుండి తమ ముద్రను వేసిన మహిళలను వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh)వారు సత్కరించి తమ కృతజ్ఞతలు ఘనంగా తెలియచేసారు.
వారిలో ముఖ్యంగా శ్రీ “ప్రశాంతి ఆశిరెడ్డి” గారు నేటి మహిళలు పలు వ్యాపారాలలో ఎలా ముందు ఉండి నడిపించాలి అంతే కాకుండా దైవ సంబంధ మరియు స్పిరిచువాలిటీకి సంభందించిన విషయాలలో మిగతా స్త్రీలు ఎలా రాణించాలి అని ఎంతో విలువైన విషయాలను తెలియజేశారు.
వక్తలలో మరొకరు శ్రీ “గీత సుంకర” గారు తమ విలువైన వైద్య (Health) సంబంధ విషయాలను, స్త్రీలకు సంబంధించి దైనందిన ఆరోగ్య సూత్రాలను, యోగ మరియు స్పిరిచువాలిటీకి (Spirituality) సంబంధించి తమ విలువైన సందేశాన్ని అందచేశారు.
మరొక వక్త శ్రీ “మాధవి కాసమ్” గారు హోమియోపతి కి సంభందించి పలు శ్రోత లు అడిగిన విషయాలకు తమ విలువైన టిప్స్ ను మరియు హోమియోపతి ఉపయోగాలను తెలియచేయారు. అలాగే పలు రంగాలలో ముందుండి రాణిస్తున్న మహిళా మణులు, మహిళా వ్యాపార వేత్తలను ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఊహ తెలిసిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయతను పంచి తనవారి కోసం అహర్నిశలు శ్రమించి, అవమానాలు భరించి తన వారి భవిష్యత్తు కోసం తనను తానే కొవ్వొత్తిలా మార్చుకుంటుంది స్త్రీ. అలాంటి మాతృమూర్తులందరికీ “వాసవి సేవా సంఘ్” వారి వందనం, అభివందనం తెలిపారు.