Connect with us

Cultural

మహిళల సృజనాత్మక నైపుణ్య ప్రదర్శన @ Chicago ఆంధ్ర సంఘ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Published

on

చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మార్చ్ 9 వ తేదీన నేషనల్ ఇండియా హబ్ (National India Hub) లో వినూత్నంగా నిర్వహించి మహిళలు రంజింపచేశారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో గీతిక మండల, అనురాధ గంపాల, సౌమ్య బొజ్జ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా చికాగో (Chicago) మహిళలు విచ్చేసారు.

సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లు, సంస్థ సభ్యులకు చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలందరూ థీమ్ ప్రకారంగా పర్పుల్ రంగు దుస్తులు ధరించి తారల వలె తళుక్కుమన్నారు. సంస్థ స్పాన్సర్ అకేషన్స్ బై కృష్ణ (Occasions by Krishna) కృష్ణ జాస్తి గారు, తమిశ్ర కొంచాడ గారి నహకారంతో వేదికను ఎంతో అందంగా అలంకరించారు. వేదిక లో ఫోటో బూత్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. యధావిధిగా దీపప్రజ్వలనతో కార్యక్రమం మొదలు పెట్టి, ఒక చక్కని గణపతి ప్రార్థనా గీతం ఆలపించారు. డా॥ సైని నర్‌వాదే, మాలతీ దామరాజు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వ్యాఖ్యానాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో Fashion Show, Jewelry out of waste, Doll decoration, Advertisements వంటి పోటీలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళలు తమ లోని కళానైపుణ్యాన్ని ఆవిష్కృతం చేసి చాలా సృజనాత్మకంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారు Barbie బొమ్మల రూపు రేఖలు మార్చి భారతీయ పద్ధతి లోనూ, పాశ్చాత్య పద్ధతి లోనూ పలు రకాల వినూత్న అలంకరణలు చేసి ప్రదర్శించారు. కేవలం చెత్తతో అందమైన నగలను రూపకల్పన చేసి న్యాయ నిర్ణేతలను అబ్బుర పరచారు. 1990’s లో ప్రసిద్ధిగాంచిన నిర్మ, అంబికా దర్‌బార్బత్తి వంటి ప్రకటనలను జనరంజకంగా అభినయించారు.

ఫ్యాషన్ షో లో పాల్గొన్న వారంతా తమను అందంగా అలంకరించుకొని రాంప్ వాక్ చేసారు. పోటీల్లో గెలిచిన విజేతలందరికీ బహుమతులను అందజేసారు. Raffle మొదటి బహుమతిగా $500 విలువ చేసే వజ్రపు ఆభరణాన్ని స్కందా జ్యువలర్స్ (Skanda Jewelers) సవితా, రాజ్ మునగ గార్లు తమ విరాళముగా అందజేసారు. Raffle లో విజేతలుగా ఎంపిక అయిన మరో నలుగురు మహిళలకు చక్కని పట్టు చీరలు వస్త్రం బై సౌమ్య (Vastram by Soumya), బ్యూటిఫుల్ ఐడియాస్ బై నీలమ్ (beautiful ideas), కలష్ కాస్‌ట్యూమ్స్ శ్వేత కొత్తపల్లి (Kalash Costumes), ఆకృతి ఫ్యాషన్స్ సరితా (Aakruthi Fashions) విరాళాలుగా బహుకరించారు.

సంస్థ యొక్క సేవావిభాగమైన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) తరఫున సవితా మునగ, అనురాధ గంపాల అన్నదానం విరాళాల కొరకు చేనేత టేబుల్ రన్నర్స్, జ్యువలర్రీ స్టాల్ అమ్మకానికి పెట్టారు. విరాళాల సేకరణ ద్వారా సమకూర్చిన ధనము Asha Jyothi Handicapped Welfare Society కి అందజేయనున్నారు. నరేశ్ చింతమాని ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ మతుకుమల్లి గారి సహాయముతో స్థానిక ఇండియన్ రెస్టారెంట్ Cool Mirchi వారు అందించిన విందు భోజనం అందరినీ తృప్తి పరచింది. సుజాత అప్పలనేని గారు ఆప్యాయంగా తయారు చేసిన మైసూర్ పాక్ విచ్చేసిన వారంతా ఆస్వాదించారు.

నాచె మయూరి (Nache Mayuri) మయూరి గారు డ్యాన్స్ ఫ్లోర్‌లో అందరితో ఎంతో సులభంగా డ్యాన్స్ చేయించారు. మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ ఫ్లోర్ల్ పై అలుపెరుగకుండా డ్యాన్స్ చేస్తూ ఆనందించారు. సంస్థ ధర్మకర్తలు సుజాత అప్పలనేని, డా.॥ భార్గవి నెట్టెం,పవిత్ర కరుమూరి, డా.॥ ఉమ కటికి, మల్లీశ్వరి పెదమల్లు, శివబాల జట్ల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. Cosmos Digital సూర్య దాట్ల, అరుణ దాట్ల ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలనందించారు.

వేడుకను విజయవంతం చేయడానికి సహకరించిన హరీష్ కొలసాని గారిని మరియు నాషనల్ ఇండియా హబ్ సిబ్బందిని, స్పాన్సర్ల ను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సవిత మునగ, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, అన్వితా పంచాగ్నుల, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల; ట్రస్టీలు మరియుఎంతో మంది వాలంటీర్లు, అందరికీ సంఘ (Chicago Andhra Association) అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి ధన్యవాదాలు తెలియచేయడంతో వేడుకలు విజయవంతంగా ముగిసాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected