Connect with us

Women

మార్చి 9న InspireInclusion థీమ్’ తో ATA ఉమెన్స్ డే సెలబ్రేషన్స్

Published

on

అమెరికా తెలుగు సంఘం (American Telugu Association – ATA) ఆధ్వర్యంలో వినూత్నంగా మహిళలు ప్రతి రంగంలో రాణించాలి అనే ఉద్దేశంతో ‘#ఇన్స్పిరేఇంక్లూషన్’ థీమ్’ తో ఉమెన్స్ డే (International Women’s Day) కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

మార్చ్ 9 వ తారీఖున వర్చ్యువల్ గా నిర్వహించే ఈ ATA International Women’s Day Celebrations లో Accenture గ్లోబల్ ఎండీ రేవతి సుబ్రమణియన్, బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) తదితరులు పాలుపంచుకుంటారు అని ATA ఉమెన్స్ చైర్ ప్రవీణ అంబటి ఒక ప్రకటనలో తెలియచేసారు.

ఆటా కార్యవర్గం తరపున ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని (Madhu Bommineni) మహిళలకు అడ్వాన్స్డ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియచేసారు. మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. ఆటా (ATA) ఉమెన్స్ డే ఈవెంట్స్ అట్లాంటా, బోస్టన్, డల్లాస్, ఫీనిక్స్, వాషింగ్టన్ డీ.సి నగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected