Iowa, March 16, 2026: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా ఐయోవాలో హియావత పబ్లిక్ లైబ్రరీలో అడ్వెంచర్స్ అన్వేల్డ్ పేరుతో ఓ అవగాహన సదస్సు నిర్వహించింది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకునే సాహస యాత్రికులకు మార్గనిర్దేశం చేసేందుకు ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమానికి ఐయోవా (Iowa) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాట్స్ ఐయోవా విభాగం (NATS Iowa Chapter) చేపట్టిన ఈ సదస్సులో స్థానిక సాహస దంపతులు పాడి, అనిత తాము విజయవంతంగా పూర్తి చేసిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, మౌంట్ కిలిమంజారో యాత్రలకు సంబంధించిన అనుభవాలను ఈ వేదికపై పంచుకున్నారు.
పర్వతారోహణకు (Mountain Climbing) అవసరమైన సన్నద్ధత, ఎదురయ్యే సవాళ్లు మరియు ఆచరణాత్మక చిట్కాలను పాడి-అనిత దంపతులు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సమాజానికి నాట్స్ అందిస్తున్న సేవలను నాట్స్ సలహా మండలి సభ్యులు జ్యోతి ఆకురాతి వివరించారు.
ముఖ్యంగా కష్టకాలంలో ఆదుకునే ‘నాట్స్ హెల్ప్‌లైన్’ ఎలా పనిచేస్తుందనేది తెలిపారు. ప్రతి ఒక్కరూ నాట్స్ సభ్యులైతే.. నాట్స్ హెల్ప్ లైన్ (NATS Helpline) వారికి కొండంత అండగా ఉన్నట్టే అనే భరోసా ఇచ్చారు. పర్వతారోహణపై విలువైన అవగాహన కల్పించిన వక్తలకు డాక్టర్ స్మిత కుర్రా ధన్యవాదాలు తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక స్పాన్సర్లను అభినందించారు. ఈ అవగాహన సదస్సు వెనుక నాట్స్ ఐయోవా చాప్టర్ (NATS Iowa Chapter) టీం జాయింట్ కో ఆర్డినేటర్ నవీన్ ఇంటూరి, నాట్స్ ఐయోవా నాయకులు గిరీష్ కంచర్ల లాజిస్టిక్స్, భోజన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఐయోవా నాట్స్ (NATS Iowa Chapter) సభ్యులు సింధు మన్వాడి వేదిక అలంకరణ సెటప్‌ను బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ అధినేత కృష్ణ మంగళమూరి, డల్లాస్ డేటా సైన్స్ అధినేత వంశీ నెల్లుట్ల… వేదికను అందించిన హియావత పబ్లిక్ లైబ్రరీ యాజమాన్యానికి నాట్స్ ఐయోవా విభాగం కృతజ్ఞతలు తెలిపింది.
ఈ అవగాహన సదస్సు అందించిన సమాచారం, స్ఫూర్తితో చాలా మంది తెలుగు వారు తమ సాహస యాత్రలను ప్రణాళిక చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. తెలుగువారి కోసం ఇంత చక్కటి అవగాహన సదస్సు నిర్వహించిన ఐయోవా నాట్స్ విభాగాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) ప్రత్యేకంగా అభినందించారు.