Indian Community Benevolent Forum (ICBF) ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం ఖతార్ (Qatar) లో నివసిస్తూ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తులను గుర్తించి ఇచ్చే అవార్డ్ లో మన తెలుగు వారికి రెండు అవార్డులు రావడం చాలా గర్వకారణంగా గుర్తిస్తూ ఆ అవార్డులు సాధించిన శ్రీ వారిజిల్ బాబు (Varzil Babu) గారిని అలాగే శ్రీ తల్లపెళ్ళి ఎల్లయ్య గారిని తెలుగు సంఘాలు ఐకమత్యంగా వారు చేస్తున్న సేవలను గుర్తించి చిరు సన్మానం చేయడం జరిగింది.
Indian Community Benevolent Forum (ICBF) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల సలహాదారులు శ్రీ కోడూరి శివప్రసాదరావు (Koduri Sivaprasada Rao) దంపతులు, శ్రీ కృష్ణ కుమార్ గారి దంపతులు రమణయ్య గారు, ఐసీసీ (ICC) నుంచి సత్యనారాయణ గారు, నందిని అబ్బాగౌని గారు, ఐసీబీఫ్ (ICBF) నుంచి శంకర్ గౌడ్ గారు, ఐయెస్ సి (ISC) నుంచి దీపక్ (Deepak) గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
తెలుగు కళా సమితి అధ్యక్షుడు హరీష్ రెడ్డి (Harish Reddy) గారు, ఆంధ్ర కళావేదిక అధ్యక్షుడు శ్రీ వెంకట (Venkata) గారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీ సుధ (Sudha) గారు తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షులు అంజయ్య (Anjaiah) గారు తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti) అధ్యక్షులు శ్రీ మైదం మధుకర్ (Maidam Madhukar) గారు మరియు తెలుగు సంఘాల కార్యవర్గ సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.