తానా న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (India Independence Day) ఆగష్టు 15, 2023 న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో సుమారు 200 మంది తెలుగువారు పాల్గొన్నారు. భారత జాతీయ గీతం జనగణమణ తోపాటు అమెరికన్ జాతీయ గీతం ఆలపించారు.
అందరూ గౌరవంగా జండా వందనం గావించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తుచేసుకున్నారు. ఆ గొప్ప వ్యక్తుల త్యాగఫలితమే భారతదేశ స్వాతంత్రం అన్నారు.
తానా న్యూ ఇంగ్లండ్ (TANA New England) మాజీ ప్రాంతీయ ప్రతినిధి కొల్లిపర శ్రీనివాస్ మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) మాజీ అధ్యక్షులు శంకర్ మగపు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. బ్రిటీష్ పాలనలో భారతదేశం ఎదుర్కొన్న బాధలను వివరించారు.
ఈ కార్యక్రమంలో తానా న్యూ ఇంగ్లండ్ ప్రస్తుత ప్రాంతీయ ప్రతినిధి కృష్ణ ప్రసాద్ సోంపల్లి, సురేష్ దోనేపూడి, భార్గవ్ ప్రక్కి, బిగ్ హెల్ప్ అధ్యక్షులు చాంద్, అమర్ జయం, అనిల్ పొట్లూరి, శ్రీనివాస్ కంతేటి, సూర్య తెలప్రోలు, వేణు కూనంనేని, బీవీఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గొండి, ప్రసాద్ అంకినీడు తదితరులు పాల్గొన్నారు.
భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అందరూ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారు అందరూ తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, బోర్డు ఛైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, అలాగే తమను వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasi Kanth Vallepalli) లకు కృతజ్ఞతలు తెలియజేశారు.