అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ బాధితులకు విరివిగా సహాయకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తామా క్లినిక్ ద్వారా భారతదేశంలోని కోవిడ్ సెకండ్ వేవ్ బాధితులకు జూమ్ మీటింగ్స్ ద్వారా డాక్టర్స్ కన్సల్టేషన్ చేస్తున్నారు. అలాగే దాతలనుంచి విరాళాలు సేకరించి వివిధ గ్రామాల్లో నిత్యావసర సరకులు, మాస్కులు, ఆక్సిజన్ మోనిటర్స్ మరియు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందజేశారు.
ఈ కోవిడ్ రిలీఫ్ కార్యక్రమాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అరకు వాలీ ట్రైబల్ ఏరియాలోని కంగనసోల, మెదరసోల, చిత్తంగొంది, పాలమనువాల్స, సంతవలస, సిద్దిపుట్ట గ్రామాల ప్రజలకు నిత్యావసర సరకులు మరియు మాస్కులు పంపిణీ చేయటం జరిగింది. క్రిష్ణాజిల్లా ఉయ్యూరులో ఆక్సిజన్ మోనిటర్స్ మరియు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో సర్జికల్ మాస్కులు పంపిణీ చేయటం జరిగింది. అలానే తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో కోవిడ్ బాధితుల కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణీ మరియు ఖమ్మంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందజేశారు.
మున్ముందు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో మరిన్ని సహాయకార్యక్రమాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసిన పరిస్థితుల దృష్ట్యా మరింతమంది దాతలు ముందుకొచ్చి సహాయకార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా తామా కార్యవర్గంవారు కోరుతున్నారు.