న్యూయార్క్ లోని ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అని భారతదేశ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమెరికా అభివృద్ధిలో, అక్కడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో శక్తివంతమైన ప్రవాస భారతీయులు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.
భారత్ మరియు అమెరికా మధ్యన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా సాగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఇటీవలి అమెరికా పర్యటన (State Visit) గురించి ప్రసంగంలో కిషన్ రెడ్డి (Gangapuram Kishan Reddy) గుర్తు చేశారు.
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ రన్ ధీర్ జైశ్వాల్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశానికి కృష్ణా రెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల, శ్రీనివాస్ దార్గుల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల ప్రత్యేక విజిటింగ్ పాస్ ద్వారా కమ్యూనిటీ లీడర్లు గా పాల్గొన్నారు.
అంతకు ముందు యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూ యార్క్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. గత రెండు రోజులుగా భారతదేశ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Gangapuram Kishan Reddy) అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.