1996 లో కట్టడం పూర్తి చేసుకొని మహా కుంబాభిషేకంతో ప్రారంభించిన టాంపా నగరంలోని హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ఈ సంవత్సరం 26 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా రాబోయే మే 19 నుండి 23 వరకు బ్రహ్మోత్సవం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.
టాంపా నగరంలోని స్థానిక లిన్ రోడ్లో నెలకొని ఉన్న ఈ దేవాలయంలో 26వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవంలో రథోత్సవం, శేష వాహన ఉత్సవం, గరుడ వాహన ఉత్సవాలతోపాటు వివిధ పూజా పునస్కారాలు నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు. ఈ దైవ సంబంధమైన మహత్తర బ్రహ్మోత్సవం వేడుకల కొరకు హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు శ్రీనివాస్ గుత్తికొండ, ఇతర బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు, పూజారులు తదితరులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని నడుచుకుంటూ ముందు తరాలవారికి కూడా తెలియచెప్పేలా నిర్వహించబోతున్న ఈ బ్రహ్మోత్సవం గురువారం మే 19 న మూల దేవత ప్రార్ధన, ఆలయ ప్రదక్షిణ పూర్వకం, గంగా పూజ వంటి వాటితో మొదలై, మే 20, 21, 22, 23 లలో అన్ని రకాల పూజా పునస్కారాలను నిర్వహించి చివరిరోజు సోమవారం మే 23 న మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగంతో పూర్తవనుంది.
పుష్పాలంకార సేవ, అన్నదాన సేవ, ఆర్జిత సేవ, సామూహిక శ్రీ సత్యనారాయణ పూజ, మహా సుదర్శన హోమం సేవార్ధి, గరుడ వాహనోత్సవ సేవాసంకల్పం వంటి సేవార్ధి పూజా స్పాన్సర్షిప్ వివరాలకు హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా వెబ్సైట్ www.htfl.org ని సందర్శించండి. ఆ శ్రీవారు అప్పుడప్పుడు అరుదుగా అందించే ఇలాంటిబ్రహ్మోత్సవంలో టాంపా తదితర ప్రాంతాల వారు పాల్గొని పుణ్యం పురుషార్థం దక్కించుకోవలసిందిగా మనవి.