Connect with us

Concert

టాలీవుడ్ గాన కోకిల సునీత లైవ్ కాన్సర్ట్ @ GWTCS ఉగాది వేడుకలు; April 15, Chantilly, Virginia

Published

on

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) ఉగాది వేడుకలు ఏప్రిల్ 15, శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తూన్నారు. కృష్ణ లాం అధ్యక్షతన నిర్వహించనున్న ఈ వేడుకలుకు వర్జీనియా, చాంటిలీ లోని ఫ్రీడమ్ ఉన్నత పాఠశాల వేదిక కానుంది.

టాలీవుడ్ ప్రముఖ గాన కోకిల సునీత ప్రత్యేక బ్యాండ్ తో చేయనున్న లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఉగాది వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక కాన్సెప్ట్ తో ఫ్యాషన్ షో, ర్యాఫుల్ బహుమతులు, ఫోటో బూత్, కిడ్స్ ఆర్ట్ కాంపిటీషన్, షాపింగ్ స్టాల్ల్స్ ఇలా మరెన్నో స్పెషల్స్ ఉన్నాయి.

టికెట్స్ పై 20% డిస్కౌంట్ నడుస్తుంది. టికెట్స్ కొరకు www.NRI2NRI.com/GWTCS-Ugadi-2023 ని సందర్శించండి. మరిన్ని వివరాలకు క్రింది ఫ్లయర్ చూడండి. వర్జీనియా, మేరీలాండ్ మరియు వాషింగ్టన్ డి.సి ప్రాంతాలకు చెందిన తెలుగు వారు అందరూ పాల్గొని జిడబ్ల్యుటిసిఎస్ వారి ఉగాది వేడుకలను విజయవంతం చేయవలసిందిగా GWTCS కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected