Connect with us

News

GWTCS స్వర్ణోత్సవ వేడుకలకు AP మంత్రులకు, స్పీకర్‌కు ఆహ్వానం: Krishna Lam

Published

on

వాషింగ్టన్‌ డీసీ లోని తెలుగువాళ్లకు గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు కల్చరల్‌ సంఘం (GWTCS) ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో గోల్డెన్‌ జూబ్లి వేడుకలను వాషింగ్టన్‌ డీసీ (Washington DC) లో సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు.

ఈ GWTCS @ 50 వేడుకల్లో భాగంగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, రాజకీయ నాయకులతో ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణ లాం చెప్పారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను జిడబ్ల్యుటిసిఎస్‌ (GWTCS) అధ్యక్షుడు కృష్ణ లాం (Krishna Lam) ఇండియాలో స్వయంగా కలిసి ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి & తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నాయకుడు నారా లోకేష్‌ను, రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి అనిత వంగలపూడి మరియు ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి & ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు లను ఆహ్వానించారు.

అలాగే జనసేన (Jana Sena Party) నాయకుడు & ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే & సంఘం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర, సినిమా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తదితరులను కృష్ణ లాం కలుసుకుని స్వర్ణోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

తన ఇండియా (India) పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పలువురు ప్రముఖులను కలిసి వాషింగ్టన్‌ డీసీ (Washington DC) లో సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ GWTCS (Greater Washington Telugu Cultural Sangam) గోల్డెన్‌ జూబ్లి వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు కృష్ణ లాం తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected