అమెరికా రాజధాని Washington DCవేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. వెస్ట్ విండ్ క్రాసింగ్ క్లబ్ హౌస్ లో జూలై 28వ తేదీన జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కమిటీ చైర్‌లు, సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు కృష్ణ లాం (Krishna Lam) మాట్లాడుతూ, ఐదు దశాబ్దాల ఘన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ కమ్యూనిటీకి ఎన్నో సేవలందిస్తున్న జిడబ్ల్యుటీసిఎస్ స్వర్ణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన హయాంలో ఈ స్వర్ణోత్సవ వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీలను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు.
కమిటీలు, పెద్దలు, ఇతరుల సహకారంతో నిర్వహించే ఈ వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు కూడా ఇండియా నుంచి వస్తున్నారని, తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. రాజకీయ నాయకులతోపాటు, సినీ, సాహిత్య, పౌరాణిక రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని, ఈ వేడుకల్లో కమ్యూనిటీ పెద్దఎత్తున పాల్గొనేలా చేయడంకోసం వివిధ కార్యక్రమాలను, పోటీలను నిర్వహిస్తున్నట్లు కృష్ణ లాం వివరించారు.
సినీ నటీనటులు అడవిశేష్, అంజలితోపాటు ఎపి హోంమంత్రి అనిత వంగలపూడి, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, గౌరు చరితారెడ్డి, సాహితీ వేత్తలు జొన్నవిత్తుల, రామజోగయ్య శాస్త్రి, గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు వస్తున్నారని చెప్పారు. ఈ వేడుకలను (Golden Jubilee Celebrations) పురస్కరించుకుని పలు పోటీలను కూడా ఏర్పాటు చేశారు.
ఆగస్టు 3వ తేదీన బ్యాడ్మింటన్ పోటీలను, ఆగస్టు 11వ తేదీన వాలీబాల్ పోటీలను, త్రోబాల్ పోటీలను, ఆగస్టు 24,25 తేదీల్లో సాంస్కృతిక, సాహిత్య పోటీలను, సెప్టెంబర్ 2వ వారంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెస్లా షో (Tesla Show) ను సెప్టెంబర్ మొదటివారంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా వేడుకలకోసం కమిటీ చైర్స్, అడ్వయిజర్లను, ఆపరేటింగ్ కమిటీ పేర్లను కూడా తెలియజేశారు. వెబ్ సైట్ లో ఈ వివరాలను పొందుపరిచిటన్లు కృష్ణ లాం తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అధ్యక్షులు కృష్ణ లాం, వైస్ ప్రెసిడెంట్ రవి అడుసుమిల్లి, సెక్రటరీ సుశాంత్ మన్నె, వైస్ ప్రెసిడెంట్ (Cultural) సుష్మ అమృతలూరి, ట్రెజరర్ భానుమాగులూరి, వైస్ ప్రెసిడెంట్ (Youth) శ్రీనివాస్ గంగ, జాయింట్ సెక్రటరీ విజయ్ అట్లూరి, సెక్రటరీ (Cultural) శ్రీవిద్య సోమ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డ్ డైరెక్టర్లు చంద్ర మాలావతు, ప్రవీణ్ కొండాక, యష్ బొద్దులూరి, రాజేష్ కాసరనేని, ఉమాకాంత్ రఘుపతి, పద్మజ బేవర కూడా ఈ స్వర్ణోత్సవ వేడుకల విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.
కమిటీ చైర్స్ వివరాలు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించడంకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిట్స్ కమిటీ చైర్‌గా మురళీ చలసాని, స్పోర్ట్స్ కమిటీ చైర్‌గా సురేంద్ర ఓంకారం, వెబ్ అండ్ సోషల్ మీడియా చైర్‌గా యువ సిద్ధార్థ బోయపాటి, ఇనాగురల్ కమిటీ చైర్‌గా సాయికాంత, సావనీర్ కమిటీ చైర్‌గా శివ మొవ్వ, రిజిస్ట్రేషన్ కమిటీ చైర్‌గా రాకేశ్ గవర్నేని, స్టేజ్ అండ్ ఎవి కమిటీ చైర్‌గా శశాంక్ పడమటి, సెక్యూరిటీ కమిటీ చైర్‌గా శివాజీ మేడికొండ, రిలీజియస్ కమిటీ చైర్ గా సుబ్బు వారణాశి, స్రిట్చువల్ కమిటీ చైర్ గా కృష్ణ గూడిపాటి, వెన్యూ చైర్ గా సునీత గొట్టిముక్కల, వలంటీర్ కమిటీ చైర్‌గా కృష్ణ వంగవోలు ఉన్నారు.
కమిటీ అడ్వయిజర్లు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించడంకోసం సలహాలు, సూచనలు ఇవ్వడంకోసం అడ్వయిజరీ టీమ్‌ను ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా సతీష్ వేమన (Satish Vemana), అడ్వయిజర్లుగా వెంకటరావు మూల్పూరి, హరినాథ్ రెడ్డి, అడప ప్రసాద్, త్రిలోక్ కంతేటి, రవి గౌర్నేని, సత్యనారాయణ మన్నె మరియు సుధ పాలడుగు ఉన్నారు.
ఆపరేటింగ్ కమిటీ స్వర్ణోత్సవ వేడుకల (Golden Jubilee Celebrations) కోసం ఆపరేటింగ్ కమిటీని కూడా నియమించారు. నాగ్ నెల్లూరి, సత్య సూరపనేని, అనిల్ ఉప్పలపాటి, బాబురావు సామల, విజయ్ గుడిసేవ మరియు సతీష్ చింత ఈ ఆపరేటింగ్ కమిటీలో ఉన్నారు.