Connect with us

Celebrations

GWTCS @ Washington DC: స్వర్ణోత్సవ వేడుకల ముఖ్య అతిథుల చిత్ర ఆవిష్కరణ

Published

on

సెప్టెంబర్ 27, 28 తేదీలలో అంగ రంగ వైభవంగా జరగబోతున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) స్వర్ణోత్సవ వేడుకలకు భాష, కళ, సాహితి, రాజకీయ రంగాల విభాగాలలో నిష్ణాతులైన పలువురు అతిరధ మహారధులు ఆహ్వానిస్తున్న సందర్భంగా అతిధుల చిత్ర పటాన్ని అధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam), తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమనతో సంయుక్తంగా ఆవిష్కరించారు.

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) విశిష్ట అతిధిగా జరగబోతున్న ఈ చారిత్రక వేడుకల కోసం ప్రతి వారం పలు భాష, క్రీడా, సాంస్కృతిక విభాగాలలో పోటీలు నిర్వహిస్తూ చిన్నారులను, పెద్దలను కలిపి పలు తరాల వారిని ఒకే వేదికపైకి చేర్చి గత నెల రోజులుగా అమెరికా రాజధాని (Washington DC) ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొందని కృష్ణ లాం (Krishna Lam) తెలిపారు.

50 ఏళ్ళ ఘన చరిత్ర గల ఈ సంస్థకు పూర్వ అధ్యక్షునిగా పనిచేసిన సతీష్ వేమన (Satish Vemana) మాట్లాడుతూ, ఇది తెలుగు వారందరికీ గర్వ కారణమైన మాతృ సంస్థ అని.. దాతలు, సభ్యులు, తెలుగు వారందరి సమక్షంలో వేడుకను (Golden Jubilee Celebrations) ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు, పలు విభాగాలను సమన్వయము చేసుకుంటున్న పలువురు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected